ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఏపీ పీసీసీ చీఫ్ శైలజా నాథ్ చురకలు అంటించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి పీకేది కాదని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను ఓ బ్రోకర్‌గా అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో ప్రశాంత్‌కిషోర్‌కు ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు.
ఏపార్టీ డబ్బులు ఇస్తే.. ఆపార్టీకి అనుకూలంగా సర్వేలు చేసే బ్రోకర్లు కూడా కాంగ్రెస్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఇకనైనా ప్రశాంత్ కిషోర్ ఆలోచించి మాట్లాడితే అందరికి మంచిదన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులు కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ నేతలను ఏమన్నా సహించమని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ ప్రశాంత్ కిషోర్‌లాంటి వాళ్లను ఎందరినో చూసిందని ఇలాంటి వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పై బురద చల్లాలని చూస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహించారు.