కర్నాటక ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వణికిపోతోంది. కర్నాటకలోని బెంగళూరులో కోవిడ్ క్వారంటైన్ తీసుకుంటున్న ఇద్దరికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరిలో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు కాగా.. మరో వ్యక్తిని బెంగళూరు వాసిగా గుర్తించారు. బెంగళూరు వాసి నుంచి మరో ఐదుగురికి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కర్నాటకలో కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ వుంటేనే కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లలోకి […]
డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా వేశారాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగ్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందన్నారు. జగన్ వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ చేశారన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒక్కటీ చేసేదీ ఒక్కటీ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి కే ఇచ్చిన హామీల్లో ఏవీ పూర్తిగా నేరవేర్చలేదని నారాలోకేష్ అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కార్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం […]
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ అనంతరం మీడియాతో మాట్లాడారు.రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికి ఉందన్నారు.చట్ట సభలకు దివ్యాంగులను పంపే బాధ్యత నేను తీసుకుంటా.దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేశాం. విభిన్న ప్రతిభావంతులకు రూ. 500 ఉండే పెన్షన్‌ను రూ. 3 వేలు చేశామని ఆయన […]
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం జవాద్తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. జవాద్ తుఫాన్ ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్లు, పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. అనంతరం తీరాన్ని ఆనుకుని కదులుతూ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలన్న ఏపీ సర్కార్ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. అంతేకాకుండా జగన్న విద్యా దీవెన పథకం పై కూడా కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్ కోటాలో నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, […]
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మసాజ్ సెంటర్ పై మల్కాజిగిరి SoT టీమ్, నేరేడ్ మెట్ పోలీసులు కలిసి దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీలో మార్టిన్స్ వెల్నెస్ బ్యూటీ స్పా పేరుతో ఒక మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తూ అందులో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. నేరేడ్మెట్ పోలీసులు మల్కాజిగిరి ఎల్.ఓ.టి సహాయంతో స్పా సెంటర్ పై దాడి చేసి […]
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్‌లు ఎలా […]
ఒమిక్రాన్ పై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. పోలియోకి వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చిందని, కరోనాకు వేగంగా వ్యాక్సిన్ తీసుకొచ్చిన ఘనత మనదేన్నారు. ఇప్పటికే దేశంలో హర్‌ఘర్ దస్తక్ కార్యక్రమం ద్వారా దేశంలో ప్రతి పౌరునికి ఉచిత టీకాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా […]
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగినా, ఒకటి రెండుచోట్ల రచ్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోనే ప్రకాశ్ రావు మీడియా సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆదిలాబాద్ లో నామినేషన్ల ఉపసంహరణ పై హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదుచేస్తానన్నారు గోనె. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన సీసీ పుటేజీ ఇవ్వాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ని కోరారు. సమాచార హక్కు చట్టం క్రింద నామినేషన్లు ఉపసంహరణకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని […]
సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం […]