ఏపీలో జగన్ పాలనపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని లెంపలేసుకుంటున్న పరిస్థితి వుందన్నారు ఎంపీ సుజనా చౌదరి. అప్రజాస్వామికంగానే అధికార పార్టీ స్థానిక సంస్థలను చేజిక్కించుకుంది.ఏ ఒక్క మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైంది. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని వైసీపీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.. అదంతా అబద్దం. వైసీపీ మాకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అన్నారు సుజనా చౌదరి. […]
రంగారెడ్డి జిల్లా బీజేపీ శిక్షణ తరగతుల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో.. హుజూరాబాద్‌లో కేసిఆర్ నియంతృత్వంతో స్వేచ్ఛను హరించారన్నారు. స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టారు. అందుకే అక్కడ ప్రజలు బయటికి మాట్లాడకుండా ఉండి అవకాశం వచ్చినపుడు ఓటుతో తమ శక్తిని చూపించారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కోరలు పీకారు. చెంప చెళ్లుమనిపించి […]
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణానికి రాజకీయ, సినీ, సామాజిక రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రోశయ్య పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. రోశయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి సమీపంలో శామీర్ పేట్ మండలంలోని దేవరయాంజల్ గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. స్టార్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన […]
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.మంథని రెవెన్యూ డివిజన్, కాసిపేట మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుక (35) భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. గత కొన్ని రోజలుగా భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరుచు గొడవలు పడుతు ఉండేవారు. ఈ రోజు కూడా గొడవ పడ్డారు. కాగా మధ్యాహ్నం పెద్దల సమక్షంలో కుటంబ సమస్యలపై పంచాయతీ పెట్టారు. పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి రాజీ కుదర్చాలని చూశారు. కానీ అంతలోనే ఘోరానికి […]
జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు తుఫాన్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అయితే తాజాగా జవాద్ తుఫాన్ నేపథ్యంలో డిసెంబర్ 5న జరగాల్సిన జాతీయ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీసీ నెట్ పరీక్షతో పాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్, ఎంబీఏ అడ్మిషన్లకు నిర్వహించే ఎగ్జామ్స్ సైతం వాయిదా పడింది. విశాఖ, పూరి, బెర్హంపూఐర్, కటక్, గుణుపూర్, భువనేశ్వర్ […]
గంజాయి అక్రమ రవాణా పెరిగిపోతోంది. ఏ రూపంలోనైనా గంజాయిని తరలిస్తూ అక్రమార్కులు అడ్డంగా బుక్కవుతున్నారు. కొందరు ఇంట్లోనే గంజాయిని పెంచుతూ దానికి బానిసలుగా మారుతున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సైఫాబాద్ పోలీసులు లకిడికపూల్ రైల్వే క్వార్టర్స్ లో నివసించే మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ టిల్లు 19 సంవత్సరాలు బ్యాండ్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. గంజాయ్ కి అలవాటు పడి దూల్ పేట్ నుంచి గంజాయి కొనుగోలు చేసేవాడు. […]
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్టు తెలంగాణ రైల్వే పోలీస్ ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అనురాధ వివరాలను వెల్లడించారు. జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా కలిసి తనిఖీలు నిర్వహించారని ఈ తనిఖీల్లో ఇద్దరు మహిళ నిందితుల నుండి రూ. 7లక్షల20 వేల రూపాయలు విలువ చేసే 72 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల్లో మహారాష్ట్ర కు చెందిన […]
నారాయణపేట జిల్లా జిలాల్ పూర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 17 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం నుండి నారాయణపేట మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా ఐటీఐ కాలేజి వద్ద బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు అన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ఆయన వాగ్దాటి, కంచుకంఠం మారుమోగుతూనే వుంటుందన్నారు చంద్రబాబు. ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని బాబు గుర్తుచేసుకున్నారు. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య. ఆయన అజాత శత్రువు.కాంగ్రెస్ పార్టీకి రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకం.16 సార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర రోశయ్యది.రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళం.. కానీ […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు […]