తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. […]
కెమిస్ర్టీ పబ్‌లో పని చేసే ఓ మహిళ పై లైంగిక దాడి జరిగిందన్న విషయం మాకు తెలియదని పబ్ ఎండీ సంతోష్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు వచ్చి చెప్పేంతవరకు లైంగిక దాడి ఘటన విషయం మాకు తెలియదని ఆయన అన్నారు. లైంగిక దాడి ఘటనకు పబ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పబ్‌లో పనిచేసే సిబ్బంది డ్యూటీ ముగించుకుని వెళ్లాక బయట […]
కరోనా కారణంగా థియేటర్లపై ఆంక్షలువ విధిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీని పరిశ్రమకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తెలిపారు.ఇప్పటికే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీని పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలిపారు. సినిమా పరిశ్రమను నమ్ముకుని ఎందరో ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. వారి ఉపాధిపైన దెబ్బకొట్టలేమని మంత్రి వెల్లడించారు. మొదటి […]
టీఆర్ఎస్ పార్టీలో శిలాఫలకం చిచ్చురేపింది. స్వంత పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. తాండూరు గులాబీ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వర్గం నేతలు అభ్యంతరం తెలపడంతో శిలాఫలకం ధ్వంసం అయింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా వుంది. పెద్దేముల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన […]
టీఎంసీ ఎంపీ నుస్రత్ ఖాన్ మోడీ ప్రభుత్వం తీరుపై లోక్ సభలో మండిపడ్డారు. దేశంలో నవరత్న, మహారత్న కంపెనీలను అమ్మేయడంపై ఆమె తీవ్రంగా విమర్శించారు. లాభాల్లో వున్న నవరత్న కంపెనీలను ఎడాపెడా అమ్మేయడం ఏంటన్నారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తూ.. దేశ సంపదను పెంచే కంపెనీలను ఎలా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తారని నుస్రత్ ఖాన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. నుస్రత్ ఖాన్ ప్రసంగం లోక్ సభలో చర్చనీయాంశం అయింది. సెయిల్, గెయిల్, కోల్ ఇండియా, ఎయిర్ ఇండియా […]
2014లో ఏపీ పీజీ ఎంఈటీ పరీక్షా పత్రం లీకేజీలో కేసులో అమీర్ అహ్మద్ కు చెందిన రూ.76 లక్షల ఆస్తులను ఈడీ తాత్కలికంగా జప్తు చేసింది. ఏపీ సీఐడీ పోలీసుల ఆధారంగా ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. ఏపీ పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆస్తులు అటాచ్ చేసింది. కర్ణాటకలోని అమీర్ అహ్మద్ ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆయనను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అప్పట్లో ఈ కేసు […]
అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం […]
చైనా యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారణ చేస్తుంది. ఫోర్జరీ బిల్లులతో రూ.1,100 కోట్లు చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లుల జారీలో సీఏ రవికుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. నకీలీ చైనా యాప్‌లను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు అతడు యత్నించినట్టు నాంపల్లి కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. బోగస్ బిల్లుల జారీలో రవికుమార్ […]
మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడిపై మరోమారు ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాగురించి వంశీ, జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ ఆఫీసు నుండి లోకేష్ చేసి పోస్టింగ్ ల పై వాళ్ళను ఏం చేయాలి? వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతానివి కావు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలవి. రాజకీయాల కోసం పెళ్ళాన్ని కూడా వాడుకుంటారా? చంద్రబాబు మహా నటుడు. చంద్రబాబు లాంటి […]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు జగన్. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది నిరాకరించింది సీబీఐ కోర్టు. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టును ఆశ్రయించారు జగన్. జగన్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్. సీఎంగా […]