ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పై మాటల తూటాలతో దాడి చేశారు. చంద్రబాబు చేసిన మోసాలు, మార్చిన రంగులను ఎవ్వరూ మర్చిపోరన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో కూడా చంద్రబాబు మనుషులు ఉన్నారన్నారు. ఎన్టీరామారావు కుటుంబాన్ని మొత్తం వాడుకున్నాడు. చంద్రబాబు ఏడవడానికి ఒక వేదిక కావాలి.
వంశీ చేసిన కామెంట్ ఆయన స్వంతంగా పెట్టింది కాదు. అది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఉంది అన్నారు. మిముల్ని బూతుల మంత్రి అంటారు. అన్నదానికి ఆయన స్పందింస్తూ చంద్రబాబు రాజకీయ వ్యభిచారి ఆయనకు లేని సిగ్గు నాకేందుకు అన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం మోసాలు, కుట్రలతో నిండి ఉందన్నారు. చంద్రబాబు 420 అంటూ తీవ్రంగా విమర్శించారు.
వైసీపీ చేస్తున్న అరాచకాలకు ప్రతిదానికి లెక్క చెబుతానని లోకేష్ అంటున్నాడు. అన్నదానికి సమాధానంగా కొడాలినాని దానికి ఆయన జీవితకాలం టైం ఇచ్చాను. వాడి లెక్కలే మేము తేలుస్తాం. పప్పుగాడు కూడా ఓడిపోయాడు. ఆ వెనకాల ఉన్న పది మంది కూడా పారిపోతారని ఈ మాటలు అన్ని చెబుతున్నారన్నారు. పంచాయతీ, మండలపరిషత్, అసెంబ్లీ అన్ని ఎలక్షలన్‌లలో టీడీపీని ఓడించారు. మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యల వల్ల మీ పార్టీకి నష్టం జరగటం లేదా..? 2014లో చంద్రబాబు పూర్తిగా నన్ను సర్వనాశనం చేశారు. నా మీద కేసులు పెట్టాడు. కానీ నాకు ఏం డ్యామేజ్ జరగలేదన్నారు. ఈ విమర్శలకు పుల్‌స్టాప్ పడినట్టేనా..? వంశీ 5శాతం తప్పు చేసిన దానికే సారీ చెప్పారు.
చంద్రబాబు ఇప్పటికైనా భువనేశ్వరికి సారీ చెబుతాడా..? అసెంబ్లీలో ఎవ్వరిని ఏం అన్నామో మాకు తెలియదు. మేము ఏం అన్నామో తెలుగు దేశం పార్టీ వాళ్లు చెప్పరు.2024 ఎన్నికల్లో చంద్రబాబు ఓడించిన తరువాతే రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాతే పరిష్కారం లభిస్తుందని కొడాలినాని అన్నారు.