జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్‌లో పవళిస్తున్న జగన్ ఇంకా నిద్రలేవలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ .. ఏపీ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురింపించారు.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారన్నారు.
సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39 మంది జలసమాధి అయ్యారు. 8 గ్రామాలు పాక్షికంగానూ, 4 గ్రామాలు పూర్తిగా దెబ్బతీన్నాయి. రూ.1,721 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఇవన్నీ ముమ్మాటీకి ప్రభుత్వ హత్యలేనని నారా లోకేష్ ఆరోపించారు. సొంత జిల్లాలో ఇంత ప్రాణ నష్టం జరిగితే నవ్వుతూ సెల్ఫీలు దిగడం, ప్రశ్నించిన ప్రతిపక్షంపై నిందలు వేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడని జగన్‌పై లోకేష్ మండిపడ్డాడు. వరద సాయం బాధితులకు అందలేదని చెబుతున్నారన్నారని అయినా పట్టించుకోవడం లేదని నారా లోకేష్ ఆరోపించారు. ఇకనైనా విపత్తులు ఎదుర్కొవడానికి మొద్దు నిద్ర వీడి మేల్కొవాలని ఎద్దేవా చేశారు.