వరంగల్ దశ తిరగనుందా? ఓరుల్లు ఇక హెల్త్ సిటీగా రూపుదిద్దుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న వరంగల్ నగరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణానికి సంబంధించి జీవో విడుదలైంది. 15 ఎకరాల్లో 1,100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. 24 ఫ్లోర్లతో భారీ భవన సముదాయం, 2,000 పడకలు ఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ కోసం […]
జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని శివమ్ గార్డెన్ లో జరుగుతున్న BJP జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటల రాజేందర్ హుజారాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తరువాత మొదటిసారి జిల్లాకు రావడంతో బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ ..కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందన్నారు. దీనిని నియంత్రించే శక్తి ఒక్క […]
స్టాలిన్ సర్కార్ తమిళనాడులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ర్ట ఆర్థికాభివృద్ధి కోసం పలు కీలక ప్రాజెక్టులను రాష్ర్టానికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్ సంఖ్యను తగ్గించారు. రాజకీయ నాయకులు ఎలా పడితే అలా మాట్లాడితే వారి పైన కఠిన చర్యలు తీసుకొనున్నట్టు తెలిపారు. రాష్ర్టంలో కోవిడ్ సెంకడ్ వేవ్‌ను తమిళనాడు ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంది. ఇండస్ర్టీయల్ పాలసీలో కూడా నూతన మార్పులను తీసుకువచ్చింది. విద్యా వ్యవస్థలోనూ సరికొత్త మార్పులను […]
పుంగనూరు(మం)బొడినాయుడు పల్లె గ్రామంలో బ్లాక్ ప్యాడి వరి (నల్లబియ్యం) కంకులను దొంగతనం చేసిన సంఘటన కలకలం సృష్టిస్తుంది. మాములుగా అయితే దొంగలు నగలు, డబ్బు, మరేదైనా ఇతర వస్తువులను దొంగతనం చేస్తుంటారు. కానీ విచిత్రంగా నల్లబియ్యం పంటపై దొంగలు కన్నేయడం ఏంటని రైతు వాపోతున్నాడు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అతి ఖరీదైన అరుదైన పంట ఈ నల్ల బియ్యం, ఈ కంకులను అర్ధరాత్రి కంకులను కోసుకుని వెళ్లారు గుర్తుతెలియని దుండగులు. కొత్త పంట పై రైతులకు […]
జవాద్ తుఫాను మత్స్యకారులకు కష్టాలు మిగిల్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చేరుకున్నాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. 44మంది సిబ్బందితో తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రతీరంలోకి వెళ్ళడం మానేశారు. ఇటు విజయనగరం జిల్లాలో తుపాన్ ఎఫెక్ట్ తో నాలుగు రోజులు గా వేటకి వెళ్లలేదు మత్స్యకారులు. అయినా అధికారులు తమను, తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం […]
రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. పీసీసీ, పీఏసీ జాయింట్ సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలని అనుకున్నామని, కానీ రోశయ్య మరణంతో ఆయన మరణం పైనే చర్చించామని షబ్బీర్ అలీ మీడియాకు తెలిపారు. రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందన్నారు.ఈ రోజు సమావేశంలో రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించినట్టు తెలిపారు. రేపు గాంధీ భవన్ లో 11 నుండి 12 వరకు రోశయ్య పార్థివ దేహాన్ని వుంచనున్నట్టు […]
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, సౌమ్యుడు రోశయ్య మరణం తీరని లోటు అని రాజకీయ నేతలు నివాళులర్పించారు. రోశయ్య అందరికీ సూపరిచితులు…ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన లేకపోవడం రాజకీయాల్లో తీరని లోటు అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎవరికీ ఇబ్బంది కలిగించే వ్యక్తి కాదు, శాంతమూర్తి. ఎన్నో చరిత్రలు రోశయ్య సొంతం అన్నారు జగ్గారెడ్డి. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. నేను అందరికీ […]
శిల్పా చౌదరిని రెండవ రోజు విచారిస్తున్నారు పోలీసులు. శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు ముందు నోరు విప్పిన శిల్పా రాధికా రెడ్డి అనే రియల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతోంది రాధికా రెడ్డి. దీంతో రాధికా రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. రాధికా రెడ్డి కి ఆరు కోట్లు ఇచ్చింది శిల్పా చౌదరి. ఆరు శాతం వడ్డీకి శిల్పా దగ్గర […]
కరోనా తరువాత దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజ్ పున:ప్రారంభం అయినప్పట్టికీ కాలేజ్‌లో ఉన్న సమస్యలపై ప్రన్సిపాల్ సిబ్బంది దృష్టి పెట్టలేదని, ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాలేజ్ సమస్యలపై అనేక సార్లు మెమొరాండం ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టినందుకు ప్రిన్సిపాల్ బ్లాక్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలేజ్ ఆవరణలో ఎక్కడికక్కడ గడ్డి పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయన్నారు. క్లాస్ రూంలో ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఆట సామగ్రి, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వంటి అనేక సమస్యలు […]
మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ… రోశయ్య వాగ్థాటిని తట్టుకోలేక ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేశారన్నారు. ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి రోశయ్య. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనేది రోశయ్యను చూసి నేర్చుకున్నామని కిరణ్తె కుమార్లి పారు. ఏ పదవి చేసినా.. ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. రోశయ్య వాగ్దాటిని తట్టుకోలేక కౌన్సిల్ రద్దుచేయాల్సిన పరిస్థితి ఆనాడు […]