NTV WebDesk
Author- NTV Telugu-
Loan Apps: లోన్ యాప్ సంస్థలపై ఈడీ కొరడా.. రూ. 86 కోట్లు ఫ్రీజ్
ఈమధ్య లోన్ యాప్ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్న నేపథ్యంలో అధికారులు వాటిపై పూర్తి దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే కుడుస్, ఎస్ మనీ, రహీనో, పయనీర్ ఫైనాన్స్ కంపెనీలపై ఈడీ కొరడా ఝుళపించింది. రూ. 86 కోట్లు ఫ్రీజ్ చేసి, ఆ కంపెనీలపై విచారణ కొనసాగిస్తోంది. ఈడీ ఇప్పటికే రూ. 186 కోట్ల నగదును ఫ్రీజ్ చేసింది. విచారణలో బాగంగా లోన్ యాప్స్ ద్వారా చైనా కంపెనీలు ఏకంగా రూ. 940 కోట్లను వసూలు చేశాయని, ఈ […] -
Nizamabad: కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు.. ముగ్గురు అరెస్ట్
నిజామాబాద్‌లో వెలుగు చూసిన ఉగ్రవాదం లింకులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓ కీలకమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కరాటే, లీగల్ అవేర్నెస్ ముసుగులో తెలుగు రాష్ట్రాల యువకులు ఓ వ్యక్తి భౌతిక దాడులు, మతపరమైన సంఘర్షణలు సృష్టించే కార్యకలాపాలకి శిక్షణ ఇస్తున్న వ్యక్తిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లాతో పాటు […] -
iPhone Fraud: ఒకటి కంటే మరొకటి ఫ్రీ
ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి..! ధరలు మరీ ఆకాశాన్నంటే స్థాయిలో ఉండటంతో.. మధ్యతరగతి వారు దాన్ని కొనుగోలు చేసేందుకు సాహసించరు. అదే.. కొన్నాళ్లకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే మాత్రం, కొనేందుకు ఎగబడుతుంటారు. అప్పుడప్పుడు పాత మోడళ్లను ఆఫర్ల పేరుతో తక్కువ ధరకే ఆన్లైన్లో అమ్మకానికి పెడితే.. విక్రయాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందేగా! క్షణాల్లోనే అమ్ముడుపోతాయి. ఇలా జనాల్లో ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ చూసే.. ఓ ముఠా ఆన్లైన్ మోసానికి పాల్పడింది. ఒక ఐఫోన్ […] -
Digital India Scam: వెలుగులోకి కొత్త కోణాలు.. పెద్ద స్కేచ్చే!
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన డిజిటల్ ఇండియ ప్రైవేట్ లిమిటెడ్ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్‌లో అమిత్ మిశ్ర, విజయ్ ఠాకూర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు తేల్చారు. దొడ్డిదారిలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఈ ఫేక్ కంపెనీ పేరుతో స్కామ్‌కి పాల్పడ్డారని తెలిసింది. ఢిల్లీ నుంచి ఈ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. అంతర్జాతీయ పుస్లకాలు, నావెల్స్ని డిజిటల్ చేస్తున్నామని వెల్లడించింది. ప్రతి పేజీకి […] -
Wanaparthy: బయటపడ్డ రెవెన్యూ అధికారుల మాయాజాలం
వనపర్తిలోని అమరచింత రెవెన్యూ అధికారుల మాయాజాలం బట్టబయలైంది. చనిపోయిన రైతు పొలంను అధికారులు ఇతరులకు పట్టా చేశారు. 43 ఏళ్ల క్రితం చనిపోయిన దేవుల బుచ్చన్న పేరుతో స్లాట్ బుక్ చేసి, ఆరు ఎకరాల భూమిని పట్టా చేసినట్టు తేలింది. ఇలా పట్టా మార్పిడి చేసినందుకు గాను అమరచింత తహశీల్దార్ భారీ మొత్తమో అందినట్టు బాధితుడు దేవుల వెంకటన్న ఆరోపణలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తహశీల్దార్ పట్టా మార్పిడి చేశారని.. అదేంటని ప్రశ్నిస్తే 43 ఏళ్ల క్రితం […] -
Revanth Reddy: కేసీఆర్‌ను 2 వేల నోట్ల మీద కాలిస్తే.. ఇంకా డబ్బులు మిగులుతాయి
ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని టీఆర్ఎస్ కొల్లగొడుతోందని, కేసీఆర్ చెప్పినట్టు ‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదని అన్నారు. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అధ్యయనం చేసిందని, ముందే చెప్పినట్టు అందులో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాకు పాల్పడుతోందని.. ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో భూ సమస్యల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. భూముల్ని రైతులు కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకుంటారని, అలాంటి […] -
Mahesh Kumar Goud: బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటే.. ఇదంతా అమిత్‌షా డ్రామా
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని.. ఇదంతా అమిత్‌షా నడుపుతున్న డ్రామా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కెమెరా ముందు విమర్శలు చేసుకుంటున్నట్టు ఆ రెండు పార్టీలు నటిస్తున్నాయని.. తెరవెనుక చాలా తతంగాలు నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తోన్న అమిత్‌షా.. ఆయనకు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఒకవేళ బీజేపీకి 10 నుంచి 15 సీట్లు వస్తే తాను […] -
MLA Seethakka: కాంగ్రెస్ పంచితే.. టీఆర్ఎస్ గుంజుకుంటోంది
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని చెప్పిన ఆమె.. దున్నేవాడికి కేసీఆర్ భూమి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం అడ్డగోలుగా భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడ భూములున్నా లాక్కుంటున్నారని విమర్శించారు. అటు.. ఫారెస్ట్ అధికారులు కూడా భూములు లాక్కుంటూ, పోడు రైతులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ […] -
Fraud Case: బోర్డు తిప్పేసిన కంపెనీ.. రూ. 50 కోట్ల భారీ మోసం
ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించే ఆఫర్ వస్తే.. ఎవరు వదులుకుంటారు చెప్పండి? దీనికితోడు నిరుద్యోగ సమస్య ఒకటి. ఈ రెండింటిని (ఆశ, నిరుద్యోగం) ఆసరాగా తీసుకొని, ఓ ప్రైవేట్ కంపెనీ వందల మందికి కుచ్చటోపీ పెట్టింది. వారి వద్ద నుంచి కోట్లు దండుకొని, పత్తా లేకుండా మాయమైంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ సంస్థ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తమది యూఎస్ బేస్డ్ కంపెనీ అని, […] -
Kodanda Reddy: ధరణి వచ్చి దరిద్రం వచ్చినట్లైంది
ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీఆర్ఎప్ ప్రభుత్వంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలుద్దామంటే, ఆయన సమయం ఇవ్వడం లేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందన రావట్లేదని పేర్కొన్నారు. భూ సమస్యతో రైతులు చనిపోతున్నారని, హత్యలు చోటు చేసుకుంటున్నాయని […]
తాజావార్తలు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!