ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని టీఆర్ఎస్ కొల్లగొడుతోందని, కేసీఆర్ చెప్పినట్టు ‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదని అన్నారు. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అధ్యయనం చేసిందని, ముందే చెప్పినట్టు అందులో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాకు పాల్పడుతోందని.. ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో భూ సమస్యల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. భూముల్ని రైతులు కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకుంటారని, అలాంటి ప్రేమని కేసీఆర్ దూరం చేస్తున్నారని అన్నారు. ఎప్పుడో అమ్ముకున్న వారి పేరు మళ్ళీ ధరణిలో ప్రత్యక్షం అవుతున్నాయని.. ప్రభుత్వం చేస్తోన్న తప్పిదాల వల్ల చాలామంది క్షణికావేశానికి గురై మర్డర్ కేసుల్ని మీద వేసుకోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
లక్ష్మపూర్‌లో వందల మంది రైతుల పేర్లు ధరణిలో నమోదు కాలేదని.. కాంగ్రెస్ పంచిన 25 లక్షల ఎకరాల భూమిని ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. 5 లక్షల ఎకరాల పోడు భూముల్ని ప్రభుత్వ భూములుగా టీఆర్ఎస్ చిత్రీకరిస్తోందని.. ప్రశ్నిస్తున్న రైతుల్ని బేడీలు వేసి జైలుపాలు చేస్తోందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో మూడు, నాలుగు కోట్ల మేర విలువ చేసే భూముల్ని కేసీఆర్ గుంజుకొని.. తన బంధువులకు, కమిషన్ ఇచ్చేవారికి పంచిపెడుతున్నారన్నారు. ఇంతవరకూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కానీ.. వేలాది ఎరకాల భూముల్ని మాత్రం ప్రైవేట్ వాళ్లకు కేసీఆర్ కట్టబెడుతున్నారన్నారు. నయా భూస్వాముల్ని సీఎం తయారు చేస్తున్నారని విమర్శించారు. వెయ్యి కోట్లు విలువ చేసే 15 ఎరకాల భూముని 300 కోట్లకే ఐకియాకు ఇచ్చారన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోందని.. మరి నిమ్మజ్‌లోని 512 ఎకరాల భూమి సంగతేంటని రేవంత్ ప్రశ్నించారు. ఎవరో కమిషన్ ఇచ్చే రాజులకు భూములిస్తున్నారన్నారు. భూముల కోసమే తెలంగాణ గడ్డపై విప్లవం వచ్చిందని.. చాకలి ఐలమ్మ పోరాటం వ్చింది భూముల నుంచేనని గుర్తు చేశారు. భూమిని రైతు ఆత్మగౌరవంగా చూస్తాడని, అలాంటి భూమిని కేసీఆర్ గుంజుకొని మన ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారన్నారు. గ్రామాల్లోని భూస్వాములకు తిరిగి భూములు కట్టబెట్టేందుకు ధరణి తెచ్చారని.. ఎమ్మార్వో ఆఫీసులో ఉండాల్సిన రికార్డులను కలెక్టరేట్‌కు తెచ్చుకొని తనకు కావాల్సినట్టుగా కేసీఆర్ రికార్డుల్ని మార్పిస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ నిర్మాణం పేరుతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని పేర్కొన్నారు.
ధరణి తెచ్చించి పేద ప్రజల మేలు కోసం కాదని.. కేసీఆర్‌ని చెప్పుతో కొట్టండంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీకు పుట్టిండా లేదా మీ అయ్యకు పుట్టిండా? అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కేసీఆర్ చెప్పింది చేయరని.. మందువేసి మాట్లాడుతాడో లేదా దిగిన తర్వాత మరచిపోతాడో తెలీదని రేవంత్ చెప్పారు. భూ దందాలతో కేసీఆర్ వంద తరాలు తినే ఆస్తి సంపాదించారని, సచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని 2 వేల నోట్ల మీద కాలిస్తే ఇంకా మస్తు పైసలు మిగులుతాయని అన్నారు. ఇకనుంచైనా తప్పులు పనులు మానుకొమ్మని కేసీఆర్‌కు హితవు పలికారు. ధరణి బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.