Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- కస్టడీలో మల్లేష్ సంచలన విషయాల వెల్లడి
- వెబ్ సిరీస్‌లు, దోపిడీ వీడియోలతో ప్లాన్
- రెక్కీ చేసి ఆయుధాలు నాగర్‌కర్నూల్‌కు తరలింపు
- అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌పై పోలీసుల ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో జరిగిన అత్యంత తీవ్రమైన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కస్టడీకి తీసుకున్న నిందితుడు మల్లేష్ నుంచి పోలీసులు సంచలన విషయాలను రాబట్టారు. 10 రోజుల పాటు సాగిన సుదీర్ఘ విచారణలో మల్లేష్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. 2009లో ఆర్మీలో చేరిన మల్లేష్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి వినియోగంపై ప్రత్యేక శిక్షణ పొందాడు. ఏ కంటోన్మెంట్లో పనిచేసినా ఆయుధాగారానికి సంబంధించిన బాధ్యతలనే నిర్వహించిన అనుభవం అతనికి ఉంది. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పలుమార్లు ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు. 16 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ తర్వాత తనకు మరో మూడేళ్ల సర్వీస్ పొడిగింపు అవకాశం ఉన్నప్పటికీ అది దక్కకపోవడంతో ఆర్మీపై కక్ష పెంచుకున్నట్లు విచారణలో వెల్లడించాడు.
నేర చరిత్ర.. వెబ్ సిరీస్‌ల ప్రేరణతో చోరీ ప్లాన్
మల్లేష్‌కు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2007లోనే ఆమ్రాబాద్, అచ్చంపేట ప్రాంతాల్లో జరిగిన ఇళ్ల దొంగతనాల కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. 2022లో కలకత్తా బ్యారక్‌పూర్‌లో పనిచేస్తున్న సమయంలో బీర్బల్ షా అనే వ్యక్తి ద్వారా అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్ దెయ్ అలియాస్ ఓబీ పరిచయమయ్యాడు. వారి వద్ద నుంచి రూ.10 వేలకు ఓ తుపాకీ కొనుగోలు చేసి దారి దోపిడీకి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఆ తుపాకీని తన స్వగ్రామంలో దాచిపెట్టాడు. 2025లో ఎదురైన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్మీ నుంచి ఆయుధాలు దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. క్రైమ్ వెబ్ సిరీస్‌లు, బ్యాంకు , బంగారు దుకాణాల దోపిడీ వీడియోలను వరుసగా చూసి చోరీకి పక్కా స్కెచ్ వేశాడు.
Also Read
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
పక్కా రెక్కీ.. నాగర్‌కర్నూల్‌కు ఆయుధాల తరలింపు
తన ప్లాన్ అమలులో భాగంగా జూలై 2026లో సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో మల్లేష్ పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. శేషులు, ప్రవీణ్, వినోద్ అనే సహచరుల సహకారంతో సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాల అమరిక, జవాన్ల కదలికల సమయాలపై నిశితంగా అధ్యయనం చేశాడు. పక్కా ప్రణాళికతో ఆయుధాలను చోరీ చేసిన అనంతరం యాక్టివా స్కూటర్, బ్రీజా కార్లలో వాటిని తరలించి నాగర్‌కర్నూల్‌లోని తన ఇంట్లో దాచిపెట్టాడు. వీటిని కలకత్తాకు చెందిన బీర్బల్ షా ద్వారా తిరిగి అవల్ దెయ్కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
అంతర్రాష్ట్ర ఆయుధ నెట్వర్క్.. పోలీసుల గాలింపు
ఈ కేసు విచారణలో దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ అక్రమ ఆయుధాల నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. మల్లేష్‌తో ఒప్పందం చేసుకున్న బీర్బల్ షాకు బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకు వచ్చే అనుమానిత వ్యక్తులతోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా బీర్బల్ షా, అవల్ దెయ్లకు దేశవ్యాప్తంగా అక్రమ ఆయుధాల సరఫరా నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బీర్బల్ షా, అవల్ దెయ్ల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
తాజావార్తలు
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!