World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ 2027 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ , గ్రూపులను ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 టీమ్‌లను ఆరు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే ఉండగా, గ్రూప్ బీలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఇందులో గ్రూప్ బీని ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా అభివర్ణిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక వంటి బలమైన జట్లు అన్నీ ఒకేచోట చేరడంతో పోటీ అత్యంత తీవ్రంగా మారనుంది.
ఈ టోర్నమెంట్ మూడు దశల్లో సాగనుండగా, ప్రతి గ్రూప్ నుంచి టాప్ 3 జట్లు నేరుగా సూపర్ 7 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే రెండు గ్రూపుల్లోనూ టాప్ 3లో నిలవని వాటిలో మెరుగైన రన్‌రేట్ లేదా ర్యాంక్ ఉన్న మరో ఉత్తమ జట్టు కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్ బీలో ఇప్పటికే బలమైన జట్లు ఉండటం వల్ల బంగ్లాదేశ్ జట్టుకు తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లడం చాలా కష్టతరంగా మారనుంది.
Also Read
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
దీనికి తోడు క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే మరో జట్టు కూడా ఈ గ్రూప్‌లో చేరితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఒకవేళ వెస్టిండీస్ వంటి జట్టు క్వాలిఫై అయి ఇదే గ్రూప్‌లో అడుగుపెడితే, ఈ గ్రూప్ కాస్తా ‘గ్రూప్ ఆఫ్ హెల్’గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండగా, బంగ్లాదేశ్ కూడా అతి కష్టం మీద నేరుగా ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!