Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Box Office Battle: తెలుగు నాట పండగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి దసరా సందర్భంగా బాక్సాఫీస్ సమరం సాధారణ పోటీని మించి పెద్ద తుఫానునే సృష్టించబోతోంది. ఒకవైపు రూ.600 కోట్ల మార్కును దాటిన రికార్డుతో తలైవా రజనీకాంత్ ‘జైలర్ 2’ వస్తుంటే.. మరోవైపు కెరీర్లోనే అత్యంత భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌గా విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. వీరికి తోడు పండగ పూట కుటుంబ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే విక్టరీ వెంకటేష్, కంటెంట్ నమ్ముకుని వచ్చే శ్రీవిష్ణు కూడా బరిలో ఉండటంతో ఈ దసరా పందెంలో అసలు విన్నర్ ఎవరు నిలుస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ దసరా పోరులో అత్యంత సెన్సేషనల్ ఎలిమెంట్ విజయ్ దేవరకొండ వర్సెస్ రజనీకాంత్ సమరమే. గతంలో ‘కింగ్డమ్’తో మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని చూసిన విజయ్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఎలాగైనా సరే సాలిడ్ మాస్ స్టార్డమ్ దక్కించుకోవాలనే కసితో ‘టాక్సీవాలా’ తర్వాత మరోసారి డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌తో చేతులు కలిపాడు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రణబాలి’ కోసం కత్తిసాము, గుర్రపు స్వారీలలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. పైగా లక్కీ పెయిర్ రష్మిక మందన్న తోడవ్వడం సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే సెప్టెంబర్ 11 నుంచి వాయిదా పడి అక్టోబర్ 16న వస్తున్న ‘రణబాలి’కి తమిళనాడులో రజనీకాంత్ ‘జైలర్ 2’ అతిపెద్ద అడ్డంకిగా మారనుంది. సూపర్ స్టార్ హవాను తట్టుకుని తమిళంలో నిలవడం కష్టమైనా, తెలుగు బాక్సాఫీస్ పైనే విజయ్ సర్వ శక్తులూ ఒడ్డుతున్నాడు. విజయ్ కెరీర్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకం కానుంది.
‘రోబో’ తర్వాత చాలా కాలం పాటు సరైన సక్సెస్ లేని రజనీకాంత్‌కు ‘జైలర్’ ఎలాంటి ఊపునిచ్చిందో అందరికీ తెలిసిందే. అదే నమ్మకంతో అక్టోబర్ 15న ‘జైలర్ 2’తో దిగుతున్నారు. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. సాధారణంగా సీక్వెల్స్ విషయంలో ప్రేక్షకులు చాలా కఠినంగా ఉంటారు. ఫస్ట్ పార్ట్‌ని మించి ఉంటేనే ‘జైలర్ 2’ని ఆదరిస్తామంటూ ఆడియన్స్ ఇప్పటికే కండిషన్స్ పెడుతున్నారు. ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయినా సినిమాకు దెబ్బ పడే ప్రమాదం ఉంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రజనీ, విజయ్ భారీ యాక్షన్ డ్రామాలతో తలపడుతుంటే, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పక్కా పండగ కళను తీసుకొస్తున్నారు వెంకటేష్, త్రివిక్రమ్. అక్టోబర్ 9న రిలీజ్ కానున్న ‘ఆదర్శ కుటుంబం’తో ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గుంటూరు కారం’ నిరాశపరిచిన తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆయనకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకం. సంక్రాంతి హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్ మార్కు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు, ఈసారి క్రైమ్ ఎలిమెంట్‌ను జోడించి కొత్తగా ట్రై చేశారు. పండగ రోజుల్లో కుటుంబాలు థియేటర్‌కు కదిలితే ఏ సినిమా అయినా నిలబడాల్సిందే. ఆ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వెంకీ మామ విన్నర్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు విలక్షణ నటుడు శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అక్టోబర్ 9నే బరిలోకి దిగుతున్నాడు. పేరు సీరియస్‌గా ఉన్నా, టీజర్‌తోనే పొట్టచెక్కలయ్యే కామెడీని ప్రామిస్ చేశాడు. సెన్సార్ చిక్కులను దాటుకుని ‘యు/ఎ’ సర్టిఫికెట్తో వస్తున్న ఈ చిత్రం, మిగతా భారీ సినిమాల మధ్య సైలెంట్ కిల్లర్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదు. రెండు లోకల్ ఎంటర్టైనర్లు, రెండు భారీ ప్యాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు.. దేనికదే భిన్నమైన శైలి. పండగ విన్నర్ కిరీటం ఎవరికి దక్కుతుంది? విజయ్ దేవరకొండ మాస్ కల నెరవేరుతుందా? రజనీ క్రేజ్ కొనసాగుతుందా? లేక వెంకీ-త్రివిక్రమ్ ఫ్యామిలీ మ్యాజిక్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుందా వీటన్నింటి మధ్యలో శ్రీవిష్ణు సైలెంట్ కిల్లర్ అవుతాడా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!