India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing XI vs WI 3rd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 3) న్యూచండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి వన్డేలోనూ విజయం సాధించి వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. ఈ స్టేడియంలో పురుషుల వన్డే క్రికెట్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.
సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 295/7 పరుగులు చేయగా.. భారత్ 41.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 139 పరుగులతో అజేయంగా నిలవగా, శుభ్‌మన్ గిల్ 110 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4/40తో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గువాహటిలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. అమిర్ జాంగూ 114, షై హోప్ 104, జాన్ క్యాంప్‌బెల్ 101 పరుగులతో సెంచరీలు చేయడంతో వెస్టిండీస్ 405/7 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే 406 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. రోహిత్ శర్మ 75 బంతుల్లో 101 పరుగులు చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 133 బంతుల్లో అజేయంగా 223 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 43.3 ఓవర్లలోనే 406/2తో విజయాన్ని అందుకుంది.
Also Read
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ఇప్పటివరకు సిరీస్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ ఆకట్టుకున్నప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. రెండు మ్యాచ్‌ల్లోనూ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగింది. మరోవైపు భారత్ 295, 405 పరుగుల లక్ష్యాలను విజయవంతంగా ఛేదించే క్రమంలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో చివరి మ్యాచ్‌లోనైనా భారత టాప్ ఆర్డర్‌ను కట్టడి చేయడం వెస్టిండీస్ బౌలర్లకు కీలకంగా మారింది. సిరీస్ ఇప్పటికే భారత్ సొంతం కావడంతో చివరి వన్డేలో తుది జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పించి వారి సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశాన్ని టీమ్ మేనేజ్మెంట్ పరిశీలించవచ్చు. మరోవైపు వరుస పరాజయాలతో ఉన్న వెస్టిండీస్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను 1-2తో ముగించాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ న్యూచండీగఢ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. భారత్‌లో మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. డీడీ ఫ్రీ డిష్ వినియోగదారుల కోసం డీడీ స్పోర్ట్స్‌లోనూ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ పూర్తి చేస్తుందా? లేక వెస్టిండీస్ పరాజయాల పరంపరకు తెరదించుతుందా? అన్నది చూడాలి.
ప్రసిద్ధ్ కృష్ణ మూడవ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నమన్ ధీర్ ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలున్నాయి. రెండవ వన్డేలో బౌలింగ్ చేస్తుండగా నమన్ గాయపడ్డాడు. దాంతో తుది జట్టులో రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ప్రసిద్ధ్ స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వచ్చే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా తుది జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో నితీష్‌కు అవకాశం ఇచ్చినా.. అతను బంతితో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లు మూడో వన్డేలో ఆడనున్నారు.
మూడో వన్డేకు తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి , కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్.
వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, కేసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), అమీర్ జంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, జేడెన్ సీల్స్, విటెల్ లాడ్జ్.
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!