Kodanda Reddy: ధరణి వచ్చి దరిద్రం వచ్చినట్లైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీఆర్ఎప్ ప్రభుత్వంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలుద్దామంటే, ఆయన సమయం ఇవ్వడం లేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందన రావట్లేదని పేర్కొన్నారు. భూ సమస్యతో రైతులు చనిపోతున్నారని, హత్యలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో చనిపోవడానికి భూ సమస్యలే కారణమన్నారు.
కాంగ్రెస్ హయాంలో భూ సమస్యలేవీ రాలేదని పేర్కొన్న కోదండరెడ్డి.. ధరణి వచ్చి దరిద్రం వచ్చినట్లైందన్నారు. అసైన్డ్ భూములను అడ్డగోలుగా గుంజుకుంటున్నారని, అధికార పార్టీ నేతలు వాటిని వెంచర్లుగా వేసుకొని కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల్ని సవరించాలని కోరిన కోదండరెడ్డి.. భూ సమస్యల్ని పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. ఈ రచ్చ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ విజయారెడ్డి హాజరయ్యారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!