‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు, భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ ప్రీక్వెల్పై ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, యష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు స్పందించి ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపించాడు. Also Read : Laya : లయ […]
నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈటీవీ విన్ బ్యానర్‌పై సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది. దసరా శుభాకాంక్షల సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి లయ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ‘ఉత్తర’ అనే గృహిణి పాత్రలో నటిస్తోంది. తన కుటుంబం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతమైన మహిళగా ఈ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోగా, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం దానిని ట్రోల్ చేశారు. దీంతో మేకర్స్ ఈ […]
చిన్నారి పెళ్లి కూతురు గా అభిమానుల హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించిన అవికా గోర్ వివాహబంధం లోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 30న, ఆమె తన ప్రియుడు మిళింద్ అద్వానీతో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవికా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.. “బాలిక నుంచి వధువు వరకూ” అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Also Read : Tere Ishk Mein : […]
బాలీవుడ్లో ‘రాన్‌జానా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో హీరో ధనుష్ మరోసారి చేతులు కలిపారు. ఈ జంట కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’ పేరుతో నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తమిళ భాషలో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ధనుష్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. Also Read : Akkineni Nagarjuna : నాగార్జున ఇమేజ్‌కు లీగల్ ప్రొటెక్షన్.. 72 గంటల్లో […]
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో తన పేరు, ఫోటోలు, వాయిస్‌తో పాటు ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అనధికారికంగా వాడుతున్నారని ఆరోపిస్తూ నాగార్జున ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన వ్యక్తిత్వాన్ని ఇలా దుర్వినియోగం చేయడం తన గౌరవ, ప్రతిష్టను దెబ్బతీస్తోందని పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నాగార్జునకు లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు […]
అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు (MSG)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరుతో పాటు టీమ్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కీలక అప్డేట్ షేర్ చేశారు. సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నయనతార పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె ఈ చిత్రంలో శశిరేఖ పాత్రలో కనిపించనున్నారు. Also Read : Peddi : రామ్ […]
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే, జాన్వీ వర్క్ విషయంలో అసలు కాంప్రొమైజ్ అవ్వరు.. అందరిలా కాకుండా ముఖ్యంగా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటారు. అయితే ఇటీవల ఒక […]
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. వివాహం తర్వాత, జీవీ ప్రకాష్ సినిమాటిక్ కెరీర్లో సక్సెస్ సాధించగా, సైంధవి సింగర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత జంట మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీరు ఈ విభేదాలను సర్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకుల కోసం నిర్ణయం తీసుకున్నారు. Also Read […]
టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్నో భారీ హిట్ చిత్రాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రం ‘బాహుబలి’ అనే చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు, తర్వాత అనేలా ఈ చిత్రం ఓ క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచాయి. ఇందులో దేవసేనగా నటించిన అనుష్క జాతీయ స్థాయిలోనే కాదు […]