రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో ల కోసం జరిగిన ప్రీ-సేల్స్ ఇప్పటికే $600K (6 లక్షల డాలర్లు) మార్కును దాటేశాయి.
Also Read : Malavika Mohanan : విజయ్ దేవరకొండ వల్ల నా సినిమా ఆగిపోయింది..
ఇంకా రిలీజ్‌కు సమయం ఉండటంతో ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రత్యంగిర సినిమాస్, పీపుల్ సినిమాస్ ఈ చిత్రాన్ని అక్కడ భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. జనవరి 8న అక్కడ గ్రాండ్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ సినిమా టీజర్ అలాగే పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.