బుల్లితెరపై ‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి ప్రియాంక జైన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే బిగ్ బాస్ తర్వాత వరుసగా సీరియల్స్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆమె మాత్రం వాటికి దూరంగా ఉంటూ ఓటీటీ, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. తాజాగా తను నటించిన ‘నయనం’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Parasakthi : ‘పరాశక్తి’లో బాసిల్ జోసెఫ్ రోల్ ఏంటో తెలుసా..?
తాను సీరియల్స్ ఎందుకు వదిలేశానో చెబుతూ.. ‘సీరియల్స్ చేస్తే ఒకే రకమైన పాత్రలో బందీ అయిపోతానేమో అన్న భయం నన్ను వెంటాడింది. పైగా సీరియల్స్ వల్ల డేట్స్ అడ్జెస్ట్ అవ్వవు, వేరే ప్రాజెక్ట్ చేయడానికి సమయం దొరకదు. నటిగా కేవలం సీరియల్ క్యారెక్టర్లకే పరిమితం అయిపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ప్రియాంక స్పష్టం చేసింది. అయితే తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం సీరియల్సేనని, ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్, ఉత్తేజ్ వంటి వారితో కలిసి ఆమె నటించిన ‘నయనం’ మర్డర్ మిస్టరీ సిరీస్ జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో నటుడు శివకుమార్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని టాక్. ఏదేమైనా, ఒకే చోట ఆగిపోకుండా విభిన్న పాత్రల కోసం ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.