శివకార్తికేయన్ హీరో గా, స్టార్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. మలయాళం స్టార్ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ చిత్రంలో ఒక కీలకమైన క్యామియో (అతిథి) పాత్రలో మెరవబోతున్నట్లు శివకార్తికేయన్ స్వయంగా వెల్లడించారు.
Also Read : Poonam Kaur :హీరోయిన్ కోసం భార్యను కోమాలోకి పంపాడు- డైరెక్టర్‌పై పూనమ్ షాకింగ్ కామెంట్స్
బాసిల్ జోసెఫ్ పాత్ర ఏంటనేది సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, ఆయన ఎంట్రీ సినిమాకు పెద్ద హైలైట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రానా దగ్గుబాటి, అతర్వా వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం ఫ్యాన్స్‌లో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. అయినప్పటికీ, రాజకీయ నేపథ్యం ఉన్న బలమైన కథ కావడంతో ఈ సంక్రాంతికి ‘పరాశక్తి’ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.