Nani: నాని లైనప్‌లో మరో క్రేజీ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు తన రూటు మార్చి పూర్తి వైల్డ్ అవతారంలోకి మారిపోయారు. రీసెంట్‌గా ‘హిట్ 3’ వచ్చిన్న నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే పీరియాడిక్ మాస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్‌లో ‘బ్లడీ రోమియో’ సెట్స్‌లోకి వెళ్లనున్న నాని, తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన ఒక ఆసక్తికరమైన సోషియో ఫాంటసీ కథకు నాని బాగా ఇంప్రెస్ అయ్యారట. ఈ చిత్రానికి ‘గౌరీ తనయ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ పురాణాల్లో ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలువబడే కార్తికేయుడి (కుమారస్వామి) పౌరాణిక అంశాలను నేటి కాలపు పరిస్థితులకు జోడించి, ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని కిషోర్ తిరుమల సిద్ధం చేశారని టాక్.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే, నాని కెరీర్‌లోనే ఇది మొదటి సోషియో ఫాంటసీ మూవీ అవుతుంది. పురాణాలకు, సమకాలీన అంశాలకు ముడిపెడుతూ తీసే ఇటువంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ సంపాదిస్తున్నాయి. గతంలో వచ్చిన ‘కార్తికేయ 2’, ‘హనుమాన్’ వంటి చిత్రాల తరహాలోనే ‘గౌరీ తనయ’ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని చేతిలో ‘ది ప్యారడైజ్’ (మార్చి 26, 2026 రిలీజ్) మరియు ‘బ్లడీ రోమియో’ వంటి క్రేజీ చిత్రాలు ఉండగా, ఈ కొత్త మూవీ ఆయన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. నాని నుండి రాబోయే ఈ క్రేజీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!