పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేసింది. ఆ స్టార్ యువ పేసర్ దీపక్ చాహర్ పంజాబ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వేసిన నాలుగు ఓవర్లలో పంజాబ్ జట్టు ముఖ్యమైన నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ రాహుల్ కూడా జడేజా అద్భుతమైన ఫిల్డింగ్ కారణంగా రన్ ఔట్ గా వెనుదిరిగాడు. కానీ […]
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార సభలో సీఎం కేసీఆర్ కేవలం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. బీజేపీని కౌంటర్ చేయలేదు. YS షర్మిల విమర్శలకు బదులివ్వలేదు. ఆ ఇద్దరినీ కేసీఆర్ ఎందుకు వదిలేశారు? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కేసీఆర్ సభలో జానారెడ్డిపైనే విమర్శలు! తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నాగార్జునసాగర్‌లో జరుగుతున్న ఉపఎన్నికే దీనికి కారణం. ఈ బైఎలక్షన్‌కు ముందు రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, నేతల విమర్శలు మరింత ఆజ్యం పోశాయి. ప్రచారం […]
సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయా నందును కలిశారు వైసీపీ నేతలు. తిరుపతి ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదు చేసారు. కృష్ణ పట్నం నుండి సత్యవేడు వరకు ఉన్న భూములను సెజ్ కోసం లాక్కుంటారంటూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసారు వైసీపీ నాయకులు. సెజ్ కోసం భూములు లాక్కొంటారని గూడూరు, సూళ్లూరు పేట, సత్యవేడు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు చెన్నై కెప్టెన్ ధోని. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా పంజాబ్ విజయం సాధించింది. ఇక గత మ్యాచ్ లో పంజాబ్ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్ లో కనిపించరు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ 2021 లో తమ […]
మన తెలుగు సినిమాలు రికార్డులు బద్దలు కొడుతూ సాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో పలు నంబర్లు హల్ చల్ చేస్తూ ఉంటాయి. దక్షిణాదిన టాలీవుడ్ నంబర్ వన్ సినిమా రంగం అంటూ ప్రచారాలూ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ, మన టాప్ స్టార్స్ సినిమాలకు వస్తున్న వసూళ్ళ వివరాలు అధికారమో అనధికారమో తెలియడం లేదు. పైగా ఎవరికి వారు అంతా ఇంతా అంటూ టముకు వేస్తున్నారు. ఇక టీజర్స్, ట్రైలర్స్ విడుదలయినప్పుడయితే, గంటల లెక్కన వ్యూస్, లైక్స్ […]
మన స్టార్ హీరోయిన్స్ సినిమాల్లోనే కాదు ఓటీటీలలోనూ దుమ్ము రేపటానికి సిద్ధం అయ్యారు. పలువురు తారలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు ఫెయిల్ అయ్యారు. ఇంకొందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మన దక్షిణాది తారలను తీసుకుంటే సమంత, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్, నిత్యామీనన్, ప్రియమణి, అమలాపాల్, పాయల్, ఇషా రెబ్బ, అషిమా వంటి తారలు వెబ్ ఎంట్రీ ఇచ్చారు. కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సీరీస్ లో నటించింది. […]
సోనూ సూద్… ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరోగా మారిన ఈ రీల్ లైఫ్ విలన్ మానవతా వాదిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న, పెద్దా… రాజు, పేద తేడా లేకుండా అడిగిన వారందరికీ సాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాడు సోనూసూద్. కొవిడ్ ఆరంభంలో ఆయన మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తనలో ఉన్న భిన్న […]
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులంతా మలయాళ చిత్రసీమపై కన్నేశారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు యంగ్ హీరో తేజా సజ్జా వరకూ మలయాళ చిత్రాలు రీమేక్ చేయడమే దానికి కారణం. థాట్ ప్రొవోకింగ్ మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు సైతం ఇప్పుడు ఇష్టపడుతున్నారని మన దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో మలయాళ సినిమాలు అనేకం డబ్ అయ్యి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. వాటికి లభించిన ఆదరణే ఈ నమ్మకానికి […]
హన్సిక ఇప్పుడు ప్రయోగాల బాట పట్టింది. తొలి సారి ప్రయోగాత్మకంగా ‘105 మినిట్స్’ పేరుతో ఓ సినిమా చేయబోతోంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒకే ఒక్క క్యారెక్టర్ తో తెరకెక్కుతుండటం విశేషం అయితే… ఎడిటింగ్ అనేది లేకుండా సింగిల్ షాట్ గా ఈ ‘105 మినిట్స్’ ని తీస్తున్నారట. రీల్ టైమ్ ఈ సినిమా రియల్ టైమ్ కావటం ఓ హైలైట్ అంటున్నారు చిత్ర దర్శకుడు రాజు […]
గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి […]