కాజల్ ఫెయిల్… తమ్మూ ఓకె… సమంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన స్టార్ హీరోయిన్స్ సినిమాల్లోనే కాదు ఓటీటీలలోనూ దుమ్ము రేపటానికి సిద్ధం అయ్యారు. పలువురు తారలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు ఫెయిల్ అయ్యారు. ఇంకొందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మన దక్షిణాది తారలను తీసుకుంటే సమంత, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్, నిత్యామీనన్, ప్రియమణి, అమలాపాల్, పాయల్, ఇషా రెబ్బ, అషిమా వంటి తారలు వెబ్ ఎంట్రీ ఇచ్చారు.
కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సీరీస్ లో నటించింది. హారర్ నేపథ్యంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీరీస్ హాట్ స్టార్ లో టెలీకాస్ట్ అయింది. అయితే ఈ ప్రయత్నంలో అమ్మడు ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. అలాగే నిత్యామీనన్ కూడా ‘బ్రీత్’ అనే సీరీస్ వచ్చి అభిషేక్ తో కలసి ఆమెజాన్ ప్రైమ్ లో సందడి చేసింది. అయితే ఈ సీరీస్ కూడా అంతగా ఆకట్టుకోలేక పోవడం గమనార్హం. ఇక శ్రుతిహాసన్, ఇషారెబ్బా, అమలాపాల్ ‘పెట్టకథలు’ అనే వెబ్ అంధాలజీ లో నటించారు. దీనికి నాగ్ అశ్విన్, నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్స్ రెడ్డి వంటి ప్రముఖులైన దర్శకులు దర్శకత్వం వహించినా ఎలాంటి ప్రయోజనం లేక పోయింది. నెటిజన్స్ ‘పిట్ట కథలు’ను తిరస్కరించారు. అలాగే ‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్ పుత్ ‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ ఫిల్మ్ లో నటించింది. ఇది కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు మరో సీరీస్ లో నటిస్తోంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ఆహా కోసం ’11త్ అవర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కార్పొరేట్ డ్రామా తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. తమన్నా నటించిన మరో వెబ్ సీరీస్ ‘నవంబర్ స్టోరీస్’ త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. పెళ్ళి తర్వాత దూసుకు పోతున్న ప్రియమణి అందరికంటే ముందుగానే ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ తో కూడా రాబోతోంది. ఇక అక్కినేని కోడలు సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతోంది. ఈ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే రూపొందిస్తున్నారు. ఈ సీరీస్ లో సమంత టెర్రరిస్టు పాత్రలో కనిపించబోతోందట. ఫిబ్రవరిలో స్ర్టీమింగ్ కావాల్సిన ఈ సిరీస్ వాయిదా పడింది. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. సినిమాల్లో మూస పాత్రలకు పరిమితం అయిన మన హీరోయిన్స్ డిజిటల్ లో మాత్రం ప్రయోగాలకు సైతం వెనుకాడటం లేదు. సమంత కూడా అలాగే తొలి సారి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విలనీ ప్రదర్శించబోతోంది. మరి ఈ ప్రయత్నంలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!