సోనూ సూద్… ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరోగా మారిన ఈ రీల్ లైఫ్ విలన్ మానవతా వాదిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న, పెద్దా… రాజు, పేద తేడా లేకుండా అడిగిన వారందరికీ సాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాడు సోనూసూద్. కొవిడ్ ఆరంభంలో ఆయన మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తనలో ఉన్న భిన్న కళలను ప్రదర్శిస్తూ వస్తున్న సోనూ… ఆ మధ్య షూటింగ్ గ్యాప్ లో దోశలు వేసి ఆకట్టుకున్నాడు. తాజాగా తనలో ఉన్న బ్యాండ్ వాలాను బయటకు తీశారు. తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు సోనూ. దానిలో సంప్రదాయ బద్దమైన డోలు వాయిస్తూ కనిపించారు. శుభకార్యాలలో ఉపయోగించే భజంత్రీలకు తోడుగా డోలు వాయిస్తూ అందులో కూడా తన టాలెంట్ ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మనమూ ఓ లుక్కేద్దామా.