గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి కృష్ణా జిల్లాలను తెలంగాణ పొలాలకు మళ్లించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 53 లక్షల ఎకరాల వరి సాగు తెలంగాణలో జరిగింది. నదులులేని చోట ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తీసుకు వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని జీవ నదులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కి దక్కుతుంది. గత ప్రభుత్వాలు రంగురంగుల ప్రచారం చేస్తూ మాటలు చెప్పారు తప్ప చేతలు చేయలేదు. గత పాలకులు మంజీర నదిపై ఒక చెక్ డ్యాం కట్టలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కృష్ణా నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించేందుకు మెదక్ జిల్లా నుండి మంజీరా నీటిని హైదరాబాద్ కు తరలించారు అని అన్నారు.