ఇండియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. అయితే ఈరోజును 221/6 తో ప్రారంభించిన భారత జట్టు మయాంక్ అగర్వాల్(150) అక్షర్ పటేల్ (52) సహాయంతో 325 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు, వచ్చిన బ్యాటర్ ను వచ్చినట్లు కుదురుకోనివ్వకుండా వెన్నకి పంపించారు. దాంతో ఆ జట్టు 62 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక […]
చిత్తూరు జిల్లాలో బ్లాక్ ప్యాడి వరి పై కన్నేసారు దుండగులు. పుంగనూరు(మం) బొడినాయుడు పల్లె గ్రామంలో బ్లాక్ ప్యాడి వరి (నల్లబియ్యం) కంకులు దొంగతనం చేసారు. అతి ఖరీదైన అరుదైన పంట ఈ నల్ల బియ్యం పంట కంకులను అర్ధరాత్రి కంకులు కోసుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. బ్లాక్ పైడి బియ్యం మార్కెట్ విలువ కేజీ సుమారు 320రూ ఉంది. అయితే ఈ కొత్త పంట పై రైతులకు ఆసక్తి కోసం ఒకటిన్నర ఎకరాల్లో ఈ పంట వేసాడు […]
మాజీ సీఎంకు రోశయ్యకు నివాళి అర్పించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రోశయ్య గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయన రాజకీయాల్లో సౌమ్యుడిగా ఉండేవారు. వాడివేడిగా సమావేశం జరుగుతున్న సమయంలో కూడా… నవ్వులు పూయించేలా చమత్కారంగా మాట్లాడేవారు అని గుర్తుచేశారు. సిరిసిల్ల లో నేత కార్మికుల గురించి అడిగితే… వెంటనే స్పందించారు అన్నారు. ఆయన ప్రజాస్వామ్య హితంగా ఉండేవారు అన్ని పేర్కొన కేటీఆర్ రోశయ్య లేరు అనేమాట… బాధాకరం… ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. అయితే రోశయ్య […]
దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా పబ్లిసిటీలో వేగాన్ని పెంచారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇందులో పూర్తి స్థాయిలో లీనమై, మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ […]
ప్రస్తుతం శిల్పా చౌదరి కేసు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. ఇక తాజాగా శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎట్టకేలకు పోలీసులు ముందు నోరూ విప్పింది శిల్పా. రాధికా రెడ్డి అనే రియాల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది శిల్పా. […]
తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. కాంగ్రెస్ పోటీ చేస్తోంది రెండు చోట్లే. మరి.. మిగిలిన నాలుగు స్థానాల్లో హస్తం వ్యూహం ఏంటి? పోటీకి దూరంగా ఉన్న జిల్లాల్లో ఎవరిపై గురి పెడుతోంది? లెట్స్ వాచ్..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరుచోట్లా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలిచే బలం ఉన్న పార్టీ సైతం ముందు జాగ్రత్త పడుతోంది. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల […]
టార్గెట్-2024 అంటూ బీజేపీ అధినాయకత్వం ఏపీ రాష్ట్రానికి కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడా కమిటీ కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమిటీలో అంతా బయట నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఇదేం చిత్రం అంటూ కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారట. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. పాతవారు పని చేయకపోతే కొత్తవారికి పెద్దపీట వేయక తప్పదుగా అని చెవులు కొరుక్కుంటున్నారట. అమిత్ షాతో భేటీ తర్వాత అమరావతి రైతుల పాదయాత్రలో ఏపీ బీజేపీ నేతలు..! తిరుపతిలో […]
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు ప్రారంభం అయిన రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా కు మంచి ఆరంభం దొరికింది. కానీ ఓపెనర్ గిల్ (44) ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా డక్ ఔట్ కాగా ఆ వెంటనే కెప్టెన్ కోహ్లీ కూడా వివాదాస్పద రీతిలో ఒక్క పరుగు కూడా చేయకుండానే […]
నిన్న మొన్నటి వరకు బలం మనదే అనే ధీమా వారిలో కనిపించింది. సీన్ కట్ చేస్తే వెన్నులో ఎక్కడో వణుకు మొదలైంది. ఆదివాసీలు ఒకే స్వరం అందుకోవడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలవడం.. అధికారపార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోందట. ఎమ్మెల్సీ ఎన్నికలు.. జిల్లాలో రాజకీయ సెగలు..! అధికారపార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకుంటున్న సమయంలో […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత సీపెట్న్ విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ ఔట్ కావడంతో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. స్వదేశంలో భారత కెప్టెన్ గా అత్యధికంగా డక్ ఔట్ అయిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. గతంలో 5 డక్ ఔట్ లతో ఈ రికార్డు పటౌడీ పేరిట […]