న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత సీపెట్న్ విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ ఔట్ కావడంతో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. స్వదేశంలో భారత కెప్టెన్ గా అత్యధికంగా డక్ ఔట్ అయిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. గతంలో 5 డక్ ఔట్ లతో ఈ రికార్డు పటౌడీ పేరిట ఉండేది. కానీ కోహ్లీ ఇప్పుడు 6 డక్ ఔట్ లతో దానిని బ్రేక్ చేసాడు. అంతే కాకుండా అత్యధికంగా టెస్టులో డక్ ఔట్ అయిన భారత కెప్టెన్ గా కుడా కోహ్లీనే ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో 10 డకౌట్‌లు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆ తర్వాత మళ్ళీ అదే 5 డక్ లతో పటౌడీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఓపెనర్ మయాంక్ ఒక్కడే సెంచరీతో రాణిస్తున్నాడు.