“ట్విట్టర్” భారత అధిపతి పై కేసు నమోదు అయ్యింది. తప్పుడు భారతదేశ భౌగోళిక చిత్ర పటం పోస్ట్ పై ఉత్తర ప్రదేశ్ లో “ట్విట్టర్” భారత అధిపతి మనీష్ మహేశ్వరి పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు. భజరంగ్ దళ్ నాయకుడు ప్రవీణ్ భాటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ దేశ ద్రోహ చర్యకు కావాలనే పాల్పడినందున, తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజిక వర్గాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు […]
తూర్పుగోదావరి కోరుకొండ మండలం వద్ద బావిలో పడి ముగ్గురు మైనర్లు గల్లంతయ్యారు. నిన్న మధ్యాహ్నం బైక్ అదుపుతప్పి పాడుబడిన వ్యవసాయ బావిలో పడిపోయారు వీర్రాజు (17), సునీల్ (17), శిరీష (13). 50 అడుగుల లోతున్న బావిలో గల్లంతైన వారికోసం నిన్న సాయంత్రం నుంచి గాలిస్తున్నారు పోలీస్ , ఫైర్ సిబ్బంది. స్థానికులు బావిలోకి దిగి చూసినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యంకాలేదు. ఆ పాడుబడిన బావిలోని ఊబిలో కూరుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావిలో […]
ఈరోజు పార్లమెంటరీ కమిటీ ముందుకు “ఫేస్ బుక్”, “గుగూల్” ప్రతినిధులు రానున్నారు. త్వరలో యూట్యూబ్, ఇతర సామాజిక సంస్థలు కూడా ఇవే ఆదేశాలు జారీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్.పి శశి థరూర్ నేతృత్వంలో ని “ ఐ.టి వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ” ముందు హాజరు కావాలని భారత్ “ఫేస్ బుక్”, “గుగూల్” సామాజిక మాధ్యమాల కు ఆదేశాలు జారీ చేసింది. పౌరుల హక్కుల పరిరక్షణకు, మరీ ముఖ్యంగా మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణలో, సామాజిక […]
ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.81 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.18 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.90 చేరగా.. […]
తాజాగా “ట్విట్టర్” మరో వివాదంలో చిక్కుకుంది. ఓ “ట్విట్టర్” యూజర్ పోస్ట్ చేసిన తప్పుడు భారత్ చిత్రపటం పట్ల తీవ్ర ఆగ్రహం, ప్రతిస్పందనలు, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లడయ్యాయి. “ట్విట్టర్” వెబ్ సైట్ లోని “ట్వీప్ లైఫ్” విభాగం లో పోస్ట్ చేసిన భారత దేశ భౌగోళిక చిత్రపటం లో జమ్మూ కాశ్మీర్, లడక్ భారత్ దేశ అంతర్భాగం కానట్లుగా ఉంది. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఆ పోస్ట్ లో ఉంది. […]
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 36,207 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 26,839 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 822.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 42.8708 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ […]
ప్రపంచ మహిళల క్రికెట్‌లో పలు రికార్డులను సొంతం చేసుకున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుతమైన రికార్డును కైవసం చేసుకోబోతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మిథాలి 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన రికార్డు టెండూల్కర్ పేరున ఉంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. మరో […]
శిఖర్‌ధావన్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీమ్‌ఇండియా శ్రీలంక వెళ్లారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వీరంతా వెళ్లారు. వచ్చేనెల ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా ముంబైలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్న వారు దానిని పూర్తిచేసుకున్నారు. కాగా, ఆటగాళ్లు విమానంలో వెళ్తున్న ఫొటోలను అలాగే అక్కడికి చేరుకున్న ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. మరోవైపు ఈ జట్టులో పలువురు సీనియర్లతో పాటు […]
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,110 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద నిలకడగా ఉన్నది. […]
ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయడానికి సమయం ఇచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలించారు. ఈ జిల్లాల్లో సాయంత్రం […]