ఒకప్పుడు కాంగ్రెస్‌కు నల్లగొండ జిల్లా కంచుకోట. ఉద్దండులైన నాయకులు ఉన్నారక్కడ. పార్టీ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లాకు పెద్దపీట వేసేవారు. ప్రస్తుతం ప్రకటించిన పీసీసీలో జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. ఎందుకీ పరిస్థితి? సీనియర్లు ఉన్నా.. ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? పీసీసీలో ఉమ్మడి నల్లగొండజిల్లాకు దక్కని ప్రాధాన్యం! దిగ్గజ కాంగ్రెస్ నాయకులు ఉన్న జిల్లా ఉమ్మడి నల్లగొండ. పార్టీకి బలమైన నాయకత్వం.. కేడర్ ఉండేది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు ఎంపీలు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. ఔట్‌గోయింగ్ పీసీసీ ప్రెసిడెంట్ […]
ఆ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్ బెర్త్ ఊరిస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై అప్పుడే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలంటే కీలకంగా మారే సమీకరణాలేంటి? ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నవారిని కదుపుతారా? ఇంతకీ ఏంటా జిల్లా? ఈసారి కేబినెట్‌లో చోటు కోసం నేతలు గట్టి ప్రయత్నాలు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేస్తామని మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో చెప్పారు ఏపీ సీఎం జగన్. […]
టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న ఆ నేత… ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? పార్టీ పెద్దలకు.. ఆ ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ వచ్చిందా? దూరం రావడానికి దారితీసిన పరిణామాలేంటి? ఆ ఎమ్మెల్యే ఏ విషయంలో సతమతం అవుతున్నారు? 2014 ఎన్నికల్లో నర్సంపేటలో ఓడిపోయారు ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన గులాబీ శిబిరంలోనే ఉన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న […]
జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్… విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ) చిత్తూరు జిల్లా, […]
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ వాడుతోందని చెల్లిని నరికి చంపేశాడు అన్న. తూత్తుకుడి జిల్లా వాసవం పురం నగర్ లో ఈ ఘటన జరిగింది. అన్ లైన్ చదువుల కోసం 12 తరగతి చదువుతున్న కవితకు సెల్ ఫోన్ కోనిచ్చాడు అన్న మలైరాజా. అయితే సెల్ ఫోన్ వచ్చాక చదువు కంటే ఎక్కవసేపు వాట్సాప్ ,వీడియోలు చూస్తూ సమయం గడుపుతుంది కవిత. అయితే తన పద్ధతి మార్చకోవాలని చెల్లిని పలుమార్లు హెచ్చరించాడు అన్న మలైరాజా. ఎన్ని […]
భారత మాజీల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అలాగే భారత పురుషుల జట్టులో కీలక ఆటగాడు అయిన స్పిన్నర్ ఆర్.అశ్విన్ ను ఖేల్ రత్న అవార్డ్ కు ఎంపిక చేసిందిబీసీసీఐ. అయితే మిథాలీ రాజ్ 22 ఏళ్లగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అశ్విన్ భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాయిగా నిలిచాడు. అయితే […]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కార్ మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాసారు. కేఆర్ఎంబీ అనుమతీ లేకుండానే తెలంగాణ జెన్ కో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించటంపై ఏపీ మరోమారు అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 1 తేదీ నుంచే విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగం జరుగుతోందని లేఖలో వివరించిన అధికారులు… ఇప్పటికే 6.9 టీఎంసీల నీటిని వాడేశారని పేర్కొన్నారు […]
ఎగువన కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 27,524 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 25,427 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 823.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 43.5460 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి […]
సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ లో గోల్ మాల్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. 748ఎకరాల భూముల వివరాలను తొలగించినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2016లో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… రామచంద్ర మోహన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో రికార్డులు మారినట్టు భావిస్తుంది. ఈఓ కు అధికారం లేకపోయినా రికార్డుల్లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. […]
శంషాబాద్ గొల్లపల్లిలో వీరంగం సృష్టించారు బీహారీలు. రాత్రిళ్లు రోడ్ల పైకి వచ్చే వారిపై దాడులు చేస్తున్నారు బీహార్ కు చెందిన యువకులు. మద్యం మత్తులో రాడ్లు, కర్రలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వాళ్ళ పై దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులపై రాడ్లు, కర్రలతో దాడి చేసారు. ఈ దాడిలో 8 బైక్ లు ధ్వంసం కాగా ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. పోలీసులకు బాధిత యువకులు ఫిర్యాదు […]