టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… ఆయన ఆరోగ్యం కుదటపడింది. హాస్పిటల్ లో ఉన్న.. ప్రజా సమస్యలపై నాతో చర్చించారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సూచించారు. ఈ ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్ అని తెలిపారు. పంజాగుట్టలో అంబేడ్కర్ […]
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా చేసారు. ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జారాయుళ్ళు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారుల పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కబ్జారాయుళ్ళను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు గచ్చిబౌలి పోలీసులు. ఖాజాగూడకు […]
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం లభించనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులుగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకదారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది.
భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన షెఫాలీ.. పిన్నవయసులోనే అన్ని ఫార్మాట్లు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 2019లో టీ20లలో అడుగుపెట్టిన ఈ ఎక్స్‌ప్లోజివ్ ఓపెనర్ ఇంగ్లండ్‌తో ఈ నెల 16-19 మధ్య జరిగిన ఏకైక టెస్టుతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయసు 17 ఏళ్ల 150 రోజులు. ఈ టెస్టులో తొలి […]
రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సిఏలో నెలకొన్న ప్రస్తుత పరినామాలతో అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్దం చేసింది అపెక్స్ కౌన్సిల్. అజార్ పై వచ్చిన ఆరోపణల పై ఈ నెల 15న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కానీ నోటీసులకు సమాధానం ఇవ్వని అజార్ పైగా తానే ప్రసిడెంట్ అని కౌంటర్ వేసాడు. దీంతో ఈ నెల 26న హెచ్ […]
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడ్డా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కుడి చేతి వేళ్లలో చీలిక వచ్చింది. మధ్య వేలు, నాలుగవ వేలికి కుట్లు వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇశాంత్ గాయం అంత సీరియస్‌గా లేదని తెలిపారు. పది రోజుల తర్వాత కుట్లు తీసివేస్తారన్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆరు వారాల సమయం ఉండడంతో… అప్పటిలోగా ఇశాంత్ కోలుకుంటాడని…ఇంగ్లండ్ సిరీస్ కు ఇషాంత్ అందుబాటులో ఉంటాడు అని బీసీసీఐ అధికారి […]
న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్‌లో భారత జట్టు ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యకారణం మాత్రం కైల్ జెమీసన్. కివీస్‌లో రాస్ టేలర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ టెస్టు తర్వాత ఎక్కువ పేరు వచ్చింది జెమీసన్‌కే. రెండు ఇన్సింగ్స్‌లలోనూ కలిపి మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన జెమీసన్ భారత జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. జెమీసన్‌పై […]
రాజేంద్రనగర్ శివరాంపల్లి లో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీలో పని చేస్తున్న కానిస్టేబుల్ వాసు ఆత్మహత్య చేసుకున్నాడు. శివరాంపల్లి రెడ్డి బస్తీలో నివాసం వుంటున్న వాసు తన గది లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి తన గది లోకి వెళ్లి ఆత్మహత్య కు చేసుకున్నాడువాసు. అయితే ఉదయం గది నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో కంగారు పడ్డ భార్య… గట్టిగా కేకలు వేస్తూ బోరున విలపిస్తుండగా వాసు ఇంటికి […]
త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్‌డక్’ అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్ రాకేశ్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్‌డక్’ను ఎలా వండుతారో […]
అడ్డగూడూరు లాకప్ డెత్ పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. 5 కోట్లు నష్టపరిహరం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు పిటీషనర్ జయవింధ్యాల. నేడు ఈ ఘటన పై పూర్తి నివేదిక హైకోర్టు కు సమర్పించునుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ కస్టోడియల్ డేత్ పై జ్యుడీషియల్ దర్యాప్తు కొనసాగుతుంది. అవసరమైతే రీ పోస్ట్ మార్టం చేయాలనీ న్యాయస్థానం సూచించింది. కానీ మరియమ్మకు పోలీసులు రీ పోస్ట్ మార్టం చేయలేదు. ఈ ఘటనలో ఇప్పటికే ఒక […]