తూర్పుగోదావరి కోరుకొండ మండలం వద్ద బావిలో పడి ముగ్గురు మైనర్లు గల్లంతయ్యారు. నిన్న మధ్యాహ్నం బైక్ అదుపుతప్పి పాడుబడిన వ్యవసాయ బావిలో పడిపోయారు వీర్రాజు (17), సునీల్ (17), శిరీష (13). 50 అడుగుల లోతున్న బావిలో గల్లంతైన వారి
కోసం నిన్న సాయంత్రం నుంచి గాలిస్తున్నారు పోలీస్ , ఫైర్ సిబ్బంది. స్థానికులు బావిలోకి దిగి చూసినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యంకాలేదు. ఆ పాడుబడిన బావిలోని ఊబిలో కూరుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావిలో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు. ఆ బావిలో పడి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు. గుమ్ముళూరు నుంచి దోసకాయలపల్లిలో అమ్మమ్మ ఇంటికి బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాజమండ్రి నార్త్ జోన్ డి.ఎస్.పి కడలి వెంటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు జరుగుతున్నాయి.