బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంటుంది. మఠాధిపతి ఎంపికపై హైకోర్టులో రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. తనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పుకునే లాగా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మఠాధిపతిగా ఎంపికైన వెంకటాద్రి స్వామి నియామకాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అని సమాచారం. వీలునామా ప్రకారం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతిని ప్రకటించారని మారుతి మహాలక్ష్మమ్మ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
నిన్నటి తెలంగాణ & పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడినవి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశ నుండి తెలంగాణా రాష్ట్రం లోనికి వస్తున్నవి. ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో రేపు కొన్ని ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణ హెచ్చరికలు:- రేపు, ఎల్లుండి భారీ వర్షములు […]
కోలీవుడ్ లో క్రేజీ హీరో శివ కార్తికేయన్. చిన్న ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి, ఇవాళ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ‘డాక్టర్’ అనే మూవీలో నటించాడు. అనిరుధ్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈ సినిమా ఈ యేడాది మార్చి 26న విడుదల కావాల్సింది. కానీ తమిళనాడులో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా అనుకున్న తేదీన […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. పార్టిసిపెంట్స్ ను ఇప్పటికే ఎంపిక చేసిన షో నిర్వాహకులు, వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో సహజంగా ఈసారి షోకు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ ఒకటి మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ తో బిగ్ బాస్ సీజన్ 1 షురూ అయ్యింది. ఆ తర్వాత రెండో సీజన్ పగ్గాలను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్ […]
తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే భాగ్యం సామాన్య భక్తులకు తిరిగి ఎప్పుడు లభిస్తుంది? సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తామనే టీటీడీ.. ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కరోనా తీవ్రతవల్ల నిలిచిపోయిన సర్వదర్శనం తిరిగి ప్రారంభించేది ఎప్పుడు? 300ల నుంచి వీఐపీల వరకు టికెట్‌లు పెట్టి దర్శనం చేయిస్తున్న టీటీడీకి ఉచిత దర్శనం ఎందుకు పట్టడం లేదు? ఆదాయంపై ఉన్న ధ్యాస సామాన్య భక్తులపై లేదా? సామాన్య భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉంటే ఆహార పానీయాలు […]
కొత్త ఎమ్మెల్సీల ఎంపిక తర్వాత ఆ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుకు మరోసారి తెరలేచింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉండటంతో రాజకీయం మూడుముక్కలాటలా మారిందా?. వారసులను రంగంలోకి దించేలా ఒకే బరిపై ముగ్గురు గురిపెట్టారా?. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం. ముగ్గురు నేతలు మూడు కీలకపదవుల్లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రిగా ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో […]
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. పీసీసీ వస్తుందని.. ఇన్నాళ్లూ కాన్ఫిడెన్స్‌తో ఉన్న వెంకన్నకి అధిష్ఠానం హ్యాండ్ ఇచ్చింది. ఆయన బరస్ట్ అయ్యారు కూడా. మరి.. రాజకీయంగా అన్నదమ్ముల దారెటు? ఇద్దరూ ఒకేవైపు అడుగులు వేస్తారా.. ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా? కోమటిరెడ్డి బ్రదర్స్ దారెటు? తెలంగాణ PCC నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కి వచ్చిన ఆయన…ఎయిర్‌పోర్టులో చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ […]
యాక్షన్ కింగ్ అర్జున్..నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియా వెండి తెరపై వినిపిస్తున్న పేరది. నటన తో పాటు సామాజిక సేవలో సేవ చేస్తూ గోప్యంగా ముందుకు సాగుతుంటారు అర్జున్. అటువంటి అర్జున్ లో ఆంజనేయ స్వామి భక్తుడున్నాడు. అందుకే ఆయన చెన్నయ్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో , తన సొంత స్థలంలో “ఆంజనేయ స్వామి “గుడికి శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ,ఎన్నో సంవత్సరాలుగా రూపొందించిన ఈ గుడి భక్తుల సందర్శనార్ధం , సర్వాంగ సుందరంగా రెడీ […]
హైదరబాద్ లో మరోసారి ఉగ్రవాదుల మూలాలు బయటపడ్డాయి. ఈ నెల 17న బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. ఈ నెల 16న దర్భంగా రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ నుంచి పార్సెల్ వెళ్లినట్లు గుర్తించారు బీహార్ రైల్వే పోలీస్ & ఏటిఎస్ బృందం. బీహార్ దర్భన్ లో రైలు నుంచి ఓ వస్త్రాల పార్సిల్ దిగుతుండగా ఈ నెల 17న పేలుడు సంభవించింది. అనంతరం […]
బీజేపీ వద్దన్నా.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఆయనపై చర్యలు ఉంటాయా? కాషాయ శిబిరాన్ని వదిలేయడానికే.. మోత్కుపల్లి ఈ ఎత్తుగడ వేశారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? మాజీ మంత్రి వివరణపై బీజేపీ సంతృప్తి చెందిదా.. లేదా? బీజేపీకి దూరం అయ్యారన్న అభిప్రాయం ఉందట టీడీపీని వీడి.. కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ […]