భారత మాజీల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అలాగే భారత పురుషుల జట్టులో కీలక ఆటగాడు అయిన స్పిన్నర్ ఆర్.అశ్విన్ ను ఖేల్ రత్న అవార్డ్ కు ఎంపిక చేసిందిబీసీసీఐ. అయితే మిథాలీ రాజ్ 22 ఏళ్లగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అశ్విన్ భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాయిగా నిలిచాడు.
అయితే భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మరియు కేఎల్ రాహుల్, బుమ్రా లను అర్జున అవార్డుకు బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం శ్రీలంకకు వెళ్లిన భారత జట్టుకు ధావన్ న్యాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాహుల్, బుమ్రా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో జట్టుకు సేవలు అందిస్తున్నారు.