శంషాబాద్ గొల్లపల్లిలో వీరంగం సృష్టించారు బీహారీలు. రాత్రిళ్లు రోడ్ల పైకి వచ్చే వారిపై దాడులు చేస్తున్నారు బీహార్ కు చెందిన యువకులు. మద్యం మత్తులో రాడ్లు, కర్రలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వాళ్ళ పై దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులపై రాడ్లు, కర్రలతో దాడి చేసారు. ఈ దాడిలో 8 బైక్ లు ధ్వంసం కాగా ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. పోలీసులకు బాధిత యువకులు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం పరారీలో ఉన్నారు దాడి చేసిన బీహారీ యువకులు
అయితే ఎన్టీవీ తో బాధితులు మాట్లాడుతూ… బీహార్ యువకులకు ఇష్టానుసారంగా అద్దెకు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఇంటి యజమానులు పట్టించుకోవట్లేదు. దీంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు దాడులు చేసిన వారు రేపు ప్రాణాలు తీస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. పోలీసులు నిఘా వైఫల్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే పెట్రోలింగ్ ను పెంచాలంటున్నారు గొల్లపల్లి గ్రామస్తులు.