తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ వాడుతోందని చెల్లిని నరికి చంపేశాడు అన్న. తూత్తుకుడి జిల్లా వాసవం పురం నగర్ లో ఈ ఘటన జరిగింది. అన్ లైన్ చదువుల కోసం 12 తరగతి చదువుతున్న కవితకు సెల్ ఫోన్ కోనిచ్చాడు అన్న మలైరాజా. అయితే సెల్ ఫోన్ వచ్చాక చదువు కంటే ఎక్కవసేపు వాట్సాప్ ,వీడియోలు చూస్తూ సమయం గడుపుతుంది కవిత. అయితే తన పద్ధతి మార్చకోవాలని చెల్లిని పలుమార్లు హెచ్చరించాడు అన్న మలైరాజా. ఎన్ని చెప్పిన వినకపోవడంతో వాట్సాప్ చూస్తున్న సమయంలోనే వెనుక నుండి వచ్చి కత్తితో విచక్షణ రహింత నరికి చంపేశాడు అన్న మలైరాజా.