కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కార్ మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాసారు. కేఆర్ఎంబీ అనుమతీ లేకుండానే తెలంగాణ జెన్ కో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించటంపై ఏపీ మరోమారు అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 1 తేదీ నుంచే విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగం జరుగుతోందని లేఖలో వివరించిన అధికారులు… ఇప్పటికే 6.9 టీఎంసీల నీటిని వాడేశారని పేర్కొన్నారు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి. ఎగువ నుంచి వచ్చిన 17.36 టీఎంసీల నీటిలో 40 శాతం నీటిని తెలంగాణ వాడేసిందని లేఖలో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.