Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి షాకిచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో జులై 1న సుమారు 10గంటల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. తాజాగా బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చింది. సంజయ్ రౌత్ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు ఈడీ గతంలో సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Whatsapp DP Frauds: వాట్సప్ డీపీ పెట్టి నైజీరియా కేటుగాళ్ళ టోకరా
తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని కుట్రగా పేర్కొన్న సంజయ్ రౌత్.. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్‌లో అటాచ్ చేసింది.