Amitabh Bachchan: బిగ్ బీని ఆశ్చర్యపరిచిన ఐదేళ్ల పిల్లవాడు.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan: నటుడు అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత బ్లాగ్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆయన తన జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను, జీవిత పాఠాలను వివరిస్తూ ఉంటారు. ఆయన రచనల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఇటీవల ఓ ఐదేళ్ల పిల్లవాడితో జరిగిన సరదా సన్నివేశాన్ని తన బ్లాగ్‌లో పంచుకున్నారు. బచ్చన్ ఓ సారి ఓ ప్రచార ప్రకటన కోసం షూటింగ్ చేస్తుండగా.. ఓ పిల్లవాడు తనను కలిశాడని తెలిపారు. అనంతరం ఆ పిల్లవాడు అమితాబ్ బచ్చన్‌ను వయస్సు గురించి అడిగాడంట. బిగ్ బీ వయస్సు చెప్పడంతో విన్న ఆ పిల్లవాడి నుంచి వచ్చిన సమాధానం అమితాబ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. “ఇంకా ఎందుకు పని చేస్తున్నావు?.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చుగా..” అని ఆ పిల్లవాడు అనడంతో బచ్చన్ ఆశ్చర్యపోయారు.
బిగ్ బీ ఇలా రాశారు. ‘క్షమించండి, మీ వయస్సు ఎంత?’ నేను ’80’ అన్నాను ! అతను వెనక్కి తిరిగి ‘ అయ్యో! అలా ఎందుకు పని చేస్తున్నావు? మా తాతలు ఇంట్లో కూర్చుని చల్లగా ఉన్నారు .. మీరు కూడా అలా చేయాలి..!!” అని పిల్లవాడితో జరిగిన సంభాషణను బచ్చన్ రాసుకొచ్చారు. బచ్చన్ ఇంకా ఇలా రాశారు , “ఆ పిల్లవాడు అన్న మాటలకు నా దగ్గర సమాధానం లేదు .. నిజంగా చెప్పాలంటే ఆ ఐదేళ్ల పిల్లాడి నిజాయితీని చూసి నేను ఆశ్చర్యపోయాను!.. రెండవది, నా దగ్గర సమాధానం లేదు!” అని బచ్చన్ తన బ్లాగ్‌లో రాశారు. షూట్ ముగింపులో అతనికి వీడ్కోలు చెప్పానని.. ఆ పిల్లవాడి తల్లి ప్రోద్బలంతో అతనికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లిపోయానని ఆయన తన బ్లాగ్‌లో తెలిపారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
Karthikeya 2: మధుర ఇస్కాన్ టెంపుల్ లో ‘కార్తికేయ 2’ చిత్రబృందం సందడి!
బిగ్ బీ త్వరలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా తిరిగి రానున్నారు. మంగళవారం ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సెట్స్‌లో పైజామాలో ఉన్న ఓ ఫొటోను ఆయన విడుదల చేశారు. సినిమాల విషయానికి వస్తే, ఆయన తదుపరి అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’లో కనిపించనున్నారు. ఇందులో అలియా భట్, రణబీర్ కపూర్, నాగార్జున కూడా నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9, 2022న విడుదల కానుంది.ఆయన వికాస్ బహ్ల్ ‘గుడ్‌బై’లో కూడా భాగమయ్యారు. ఇందులో ఆయన భాస్కర్ ప్రజాపతి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు రష్మిక మందన్న, నీనా గుప్తాలు కూడా నటిస్తున్నారు. అతను ‘ది ఇంటర్న్’ రీమేక్, ‘ప్రాజెక్ట్ కె’ కోసం దీపికా పదుకొణెతో కలిసి నటిస్తున్నారు. అంతే కాకుండా, పరిణీతి చోప్రా, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ నటించిన తన రాబోయే ప్రాజెక్ట్ ‘ఉంచై’ కోసం బిగ్ బి తన షూట్‌ను కూడా ముగించుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!