Sanjay Raut: బీజేపీలో ఎన్సీపీ, షిండే సేన విలీనం కాబోతున్నాయి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- బీజేపీలో ఎన్సీపీ, షిండే సేన విలీనం కాబోతున్నాయి
- ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- ఇటీవలే ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్ మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిక మేరకు ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన బీజేపీలో విలీనం కావొచ్చని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లేకుండానే చర్చలు జరిగినట్లుగా చెప్పారు. చర్చలు జరిగాయని శరద్ పవార్ కూడా ధ్రువీకరించారని తెలిపారు. త్వరలోనే ఆ రెండు పార్టీలో బీజేపీలో విలీనం అవుతాయని జోస్యం చెప్పారు.
‘‘ఎన్సీపీ వర్గాలు రెండూ విలీనం అవుతాయని నేను అనుకోను. కానీ అలా జరిగితే నేను సంతోషిస్తాను. ప్రఫుల్ పటేల్ చెబుతున్నదే అమిత్ షా చెబుతున్నది. రెండింటి విలీనం గురించి మీ దగ్గర ఏదైనా గట్టి సమాచారం ఉందా?. అమిత్ షా కోరిక మేరకు ఎన్సీపీ, బీజేపీ విలీనంపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్సీపీ బీజేపీలో విలీనం అవుతుంది. ఏక్‌నాథ్ షిండే పార్టీ కూడా బీజేపీలో విలీనం అవుతుంది.’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఫిబ్రవరి 4న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. రెండు ఎన్‌సీసీ వర్గాల విలీనంపై చర్చలు అజిత్ పవార్-జయంత్ పాటిల్ మధ్య జరిగాయని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కాదని అన్నారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
జనవరి 28 ఉదయం పూణె జిల్లాలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో అజిత్ పవార్ మరణించారు. అనంతరం ఆయన భార్య సునేత్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: EC-Elections: 4 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. షెడ్యూల్ ఎప్పుడంటే…!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!