అమెరికాలో మంకీపాక్స్ వ్యాధిని మొదటిసారిగా పిల్లల్లో గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఇద్దరు పసిపిల్లలకు మంకీపాక్స్ సోకిందని యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ రెండు మంకీపాక్స్ కేసులు గృహ ప్రసారం ఫలితంగా ప్రబలి ఉండవచ్చని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది.
బ్యాంకు రుణాల ఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సంబంధించిన కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పురోగతి సాధించారు. నీరవ్‌కు సంబంధించిన ₹253.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ జాబితాలో చరాస్థులైన రత్నాలు, ఆభరణాలతో పాటు బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు.
పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శివభక్తులు గ్వాలియర్ నుంచి యూపీలోని హరిద్వార్ మీదుగా తమ సొంత జిల్లాకు వెళ్తుండగా.. హత్రాస్‌లోని సదాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్లిన ఏడుగురు భక్తులను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం రిఫ్రిజిరేటర్‌లో లభించింది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకుని ఫ్రిజ్‌లోని మృతదేహాన్ని బయటకు తీశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రెండో విడత విచారించనున్న తేదీని ఈ నెల 25 కాకుండా 26కు మార్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడింటారు. ఈ మేరకు సోనియాకు ఈడీ తాజా సమన్లు జారీ చేసింది.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని తెలియని కూలీలు ఇవాళ ఉదయం పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు.
తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటి వర్షానికి మరోసారి వాగులు, వంకలు ఉప్పొంగాయి. రహదారులపైకి వరద నీరు చేరి.. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హబూబాబాద్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నారు. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ కొత్తచెరువు కూడా జోరుగా అలుగు పారుతోంది. ఈ నేపథ్యంలో పెనుప్రమాదం తప్పింది.
తెలంగాణలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. విద్యా శాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతిపోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.