India vs Pakistan: తాజా రిపోర్ట్స్‌తో కొత్త టెన్షన్.. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని పూర్తిగా చెప్పలేం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసి పోతుంది. నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇండియా-పాక్ మ్యాచ్‌పై మొదటి నుంచే సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కిరిస్తామని పెద్ద హై డ్రామా క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అనేక సమావేశాల తర్వాత ఎట్టకేలకు ఆడతామని అంగీకరించింది. అయితే..
తాజాగా ఈ మ్యాచ్‌కు మరో టెన్షన్ మొదలైంది. అదే వర్షం.
READ MORE: Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
శనివారం తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. మ్యాచ్ జరిగే అవకాశాలపై సందేహం కలుగుతోంది. పగలు సమయంలో 65 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని, చినుకులు మాత్రమే కాదు.. మెరుపులతో కూడిన వాన పడొచ్చని సమాచారం! రాత్రికి వర్షం అవకాశాలు 25 శాతానికి తగ్గుతాయని చెబుతున్నా.. సాయంత్రం 7 గంటల సమయంలో మళ్లీ 49 నుంచి 65 శాతం వర్షం పడే అవకాశం ఉండొచ్చని కొన్ని స్థానిక అంచనాలు సూచిస్తున్నాయి. గాలి ఉత్తర దిశ నుంచి గంటకు సుమారు 11 మైళ్ల వేగంతో వీయనుంది. వాతావరణం మొత్తం తేమగా ఉండే అవకాశముంది. ఈ వార్తల నేపథ్యంలో మ్యాచ్ పూర్తిగా రద్దవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో ఉత్పన్నమవుతోంది. టీ20 మ్యాచ్‌కు ఫలితం రావాలంటే ప్రతి జట్టు కనీసం 5 ఓవర్లు అయినా ఆడాలి. అంతకంటే తక్కువగా ఆడితే ఫలితం వెలువడదు. అలాంటి పరిస్థితిలో మ్యాచ్‌ను రద్దు చేసినట్టే అని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. అంటే వర్షం వల్ల ఆట ఆగిపోయి 5 ఓవర్లు కూడా పూర్తి కాకపోతే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇస్తారు. మ్యాచ్‌ను తిరిగి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవు.
READ MORE: MS Dhoni: ఏంటి..! ధోనీని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తొలగించారా..? బయట పడిన సంచలన నిజం
ఇప్పటికే ఈ మ్యాచ్ జరగాలని ఐసీసీ చాలా కృషి చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మొదట భారత్‌తో ఆడబోమని చెప్పినప్పుడు, ఐసీసీ అధికారులు లాహోర్‌కి వెళ్లి చర్చలు జరిపారు. చివరకు పాకిస్థాన్ ఒప్పుకుంది. కానీ ఇప్పుడు నిర్ణయం వాతావరణం చేతుల్లో ఉంది. మ్యాచ్ రద్దయితే ప్రసార హక్కులు పొందిన జియోస్టార్ సంస్థ ఎక్కువగా నష్టపోయేది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. ఆ భారీ వీక్షణల మీదే ప్రకటనల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మ్యాచ్ లేకపోతే ఆ ఆదాయం తగ్గిపోతుంది. టికెట్లు కొన్న అభిమానులకు సైతం ఇబ్బంది పడేవారు. మ్యాచ్ పూర్తిగా జరగకపోతే సాధారణంగా టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే శ్రీలంక క్రికెట్ బోర్డుకు గేటు రుసుముల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. రేపు ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!