NEET Controversy: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు విద్యార్థిని తన ఇన్నర్‌వేర్‌ను తొలగించమని కోరిన ఘటనకు సంబంధించి ఎన్‌టీఏ పరిశీలకుడితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కేరళలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తుల్ని విప్పించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. లోదుస్తులు తీశాకే పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ ప్రిజీ కురియన్ ఇసాక్, డాక్టర్ శ్యాంనంద్‌ను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గతంలో ఐదుగురిని అరెస్టు చేశారు.
కొల్లాం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాఠశాల యాజమాన్యం చేసిన పని దేశంలోనే సంచలనంగా మారింది. సభ్య సమాజం సిగ్గు పడేలా చేసింది. జూలై ఆదివారం (17న) జరిగిన నీట్ పరీక్షలో విధ్యార్థినులపై దారుణంగా ప్రవర్తించింది. నీట్ విధ్యార్థినులను చెక్ చేయడమే కాకుండా లోదుస్తులు (బ్రా)ను తీసేయాలని పేర్కొంది. దీంతో విధ్యార్థులు షాక్ తిన్నారు. లోదుస్తులు ఎందుకు తీయాలని ప్రశ్నించగా.. తీస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామనడంతో.. గత్యంతరం లేక లోదుస్తులను తీసి పరీక్ష రాసేందుకు లోనికి వెళ్లాల్సి వచ్చింది. ఈ మేరకు మంగళవారం కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లాం రూరల్ పోలీస్ జిల్లా పరిధిలోని చడయమంగళం పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 354, 509 కింద కేసు నమోదైంది. జులై 18న అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నీట్ పరీక్ష ముగిసిన తర్వాత ఒక విద్యార్థి కొల్లాం పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్ష హాల్‌లోకి వెళ్లే ముందు తన ఇన్నర్‌వేర్‌ను తొలగించాలని అడిగారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది.
Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
అయితే పరీక రాసేప్పుడు విధ్యార్థినులు తమ కురులను ముందుకు వేసుకుని రాయాల్సి వచ్చింది. మరి కొందరు విద్యార్థులైతే కన్నీటితో పరీక్షను రాసారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థినులు తల్లిదండ్రులను ఈ విషయం తెలుపడంతో.. ఇదికాస్త వివాదాస్పదమైన నేపథ్యంలో.. నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలకు ఉపక్రమించింది. వివిధ మీడియా కథనాల ద్వారా తమకు సమాచారం అందిందని, ఈనేపథ్యంలో.. కమిటీ ఏర్పాటు చేసినట్లు, కమిటీ సభ్యులు కొల్లంను సందర్శించి నివేదిక రూపొందిస్తారని, దాని ఆధారంగా తుది చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.