World Health Organization: ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం చెప్పారు. మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉంటామని టెడ్రోస్ అధనామ్ చెప్పారు. ఇప్పటివరకు మంకీపాక్స్ సోకి 5గురు ప్రాణాలు కోల్పోయారని డబ్లూహెచ్‌వో వెల్లడించింది. ఈ మరణాలన్నీ ఆఫ్రికాలోనే సంభవించాయని టెడ్రోస్ ట్వీట్‌లో తెలిపారు.
కొన్ని దేశాల్లో కేసులు తగ్గుదల నమోదవుతున్నప్పటికీ, చాలా వరకు పెరుగుతున్నాయని, గత వారం దాదాపు ఆరు దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ చెప్పారు. ఇప్పటివరకు నివేదించబడిన మంకీపాక్స్ కేసుల్లో చాలా కేసులు యూరప్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి పురుషుల మధ్య లైంగిక సంబంధం ఉన్న వారిలోనే ఉన్నట్టుగా పేర్కొన్నారు. వ్యాప్తిని ట్రాక్ చేయడం, ఆపడం చాలా కష్టమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ జోడించారు. ఎందుకంటే కేసులను నివేదించే అనేక దేశాలు తక్కువ డయాగ్నస్టిక్స్, వ్యాక్సిన్‌లను కలిగి ఉన్నాయనన్నారు. పలు దేశాల్లో మంకీపాక్స్ పరీక్షలను నిర్వహించడం కోసం సంస్థ తన మద్దతును కొనసాగిస్తుందని కూడా టెడ్రోస్ చెప్పారు. మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టాలంటే సమాచార సాధనం ముఖ్యమైనదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సమాచారం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని కాస్త అరికట్టొచ్చన్నారు. మంకీపాక్స్ వైరస్ సోకిన జంతువుల నుండి మానవులకు పరోక్ష లేదా ప్రత్యక్ష పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. ముఖాముఖి, చర్మం నుండి చర్మం శ్వాసకోశ బిందువులతో సహా అంటువ్యాధి చర్మం లేదా గాయాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవుని నుండి మానవునికి ప్రసారం జరుగుతుంది.
ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న దేశాలలో నివేదించబడిన మంకీపాక్స్ కేసులలో, లైంగిక సంపర్కంతో సహా సన్నిహిత శారీరక సంపర్కం ద్వారా ప్రధానంగా వ్యాప్తి జరుగుతున్నట్లు సమాచారం. భారత్‌లో కూడా రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. విమానాశ్రయాలు, ఓడరేవుల ద్వారా భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షించాలని ఆదేశించింది.విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు అందరి పైనా కఠినంగా స్క్రీనింగ్ చేయాలని స్పష్టం చేసింది. వారు మన దేశంలో అడుగుపెట్టగానే వారికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
Harish Rao: కరోనా టెన్షన్.. బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేయండి
ఇప్పటి వరకు ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపైనా స్క్రీనింగ్ చేశారు. అనుమానం ఉన్న శాంపిల్స్‌ను పుణెలోని ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ, మంకీపాక్స్ రెండో కేసు కూడా నమోదు కావడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.ఇక, దేశంలో నమోదైన రెండు కేసులు కూడా కేరళలోనే వెలుగుచూడటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.