మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకాలో గల కడ్బన్‌వాడి గ్రామంలో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఒక ట్రైనీ విమానం వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ శిక్షణలో ఉన్న 22 ఏళ్ల భావికా రాఠోడ్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది.
బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు.
రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు. పౌరులు మహాత్మా గాంధీ జీవితం, బోధనల గురించి ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాల పాటు ఆలోచించాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని పర్వౌంఖ్ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్య పటిష్టతను సూచిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు.
జేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిపై రాజాసింగ్‌కు ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శల వర్షం గుప్పించారు. గోషామహల్ గుడుంబా కింగ్ రాజాసింగ్ అంటూ ఆరోపించారు.
బిహార్‌లోని సరన్ జిల్లా ఛప్రాలో భారీ పేలుడు సంభవించింది. చఫ్రాలో ఓ ఇంట్లో ఆదివారం జరిగిన పేలుడు కారణంగా ఇల్లు కూలి ఆరుగురు మరణించారని జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు.
కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఈ విశ్రాంతి సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్ చూడటానికి తనకు సలహా ఇవ్వమని కోరారు. దాంతో చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలని సూచించారు. అభిమానులు, సెలబ్రిటీలే కాకుండా ఓటీటీ సంస్థలు కూడా శుభాకాంక్షలతో పాటు సినిమాలు, సిరీస్‌లు చూడాలని కోరాయి.
తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన.. తాజాగా బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి సరదాగా గడిపారు.
ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు.
ఫిలిప్పీన్స్‌లోని యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మనీలాలోని యూనీవర్సిటీ క్యాంపస్ ఆదివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి కాల్పులకు తెగబడగా.. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.