తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఇదే రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు రేకిత్తించిన కల్లకురిచ్చిలో విద్యార్థి మృతి ఘటన మరవకముందే ఇది చోటుచేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది.
జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తిలో తొలిసారిగా మంకీపాక్స్‌ను నిర్ధారించినట్లు జపాన్ సోమవారం ధృవీకరించిందని టోక్యో గవర్నర్ యురికో కోయికే ప్రకటించారు. ఆ వ్యక్తి యూరప్ నుంచి తిరిగి వచ్చినట్లు గుర్తించారు.
పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీపై ఈడీ విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఆ విషయంపై స్పందించని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు.
టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కానీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఒడిశా భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.
పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి గిరిజన నాయకురాలిగా చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రత్యేక వస్త్రధారణతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె రంగురంగుల దారాలతో నేసిన సంప్రదాయ సంతాలీ చీరను ధరించారు.
దాదాపు 5నెలలుగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌లో ఖార్కివ్ ప్రాంతంలోని చుహుయివ్ పట్టణంలో రష్యా సైనికులు బాంబు దాడి చేశారు. దీని ఫలితంగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఉక్రెయిన్ అధికారులు అనుమానిస్తున్నారు.
పశ్చిమబెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్థ ఛటర్జీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు కూడబెట్టిన తీరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బయటకు తీస్తూ వస్తోంది. తాజాగా ఈడీ విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు ఈడీ విచారణలో తేలింది.
లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని, ఉపరాష్ట్రపతితో పాటు విదేశీ ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కళాకారులు సైతం వినూత్నంగా నూతన రాష్ట్రపతికి అభినందనలు తెలిపారు.
రాజస్థాన్‌లోని కోటాలో గల అప్నా ఘర్ ఆశ్రమంలో కలుషిత ఆహారం కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 15 మంది ఆసుపత్రి పాలైనట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఇవాళ ఉదయం కొందరు నిద్ర లేవకపోవడంతో, మరికొందరు వాంతులు చేసుకోగా వారిని ఆస్పత్రికి తరలించారు.