PM Narandra Modi: టార్గెట్ 2024.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narandra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా పాల్గొన్నారు. గతంలో ఇలాంటి చివరి సమావేశం 2021 డిసెంబర్‌లో వారణాసిలో జరిగింది. ఈ సమావేశంలో, ప్రధాని మోదీ గతిశక్తి, హర్ ఘర్ జల్, స్వామిత్వ, డీబీటీ అమలు, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ వంటి కొన్ని కీలక పథకాలు, కార్యక్రమాలను ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా అమలు చేయాలని ఉద్ఘాటించారు.
గ్రామీణ ప్రాంతాల గురించి మాట్లాడుతూ.. గోబర్ధన్ వెబ్ పోర్టల్ ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. పంట ఉత్పాదకతపై నానో-ఎరువుల యొక్క సానుకూల ప్రభావం గురించి ఆయన వివరించారు. వాటి వినియోగాన్ని పెంచడం గురించి మాట్లాడారు. అన్ని కీలక పథకాల సంతృప్త స్థాయి కవరేజీని నిర్ధారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేయాలని అన్నారు. సులభతరమైన వ్యాపారాన్ని పెంపొందించాల్సిన అవసరం గురించి ప్రధాని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మరింత పెంచే దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
President Ramnath Kovind: రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ చివరి ప్రసంగం.. ఆయన సందేశమిదే..
తమ రాష్ట్రాలు క్రీడలకు సముచితమైన ప్రాధాన్యతనిచ్చేలా చూడాలని.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి, నిమగ్నమయ్యేలా ప్రోత్సహించడానికి అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలని ప్రధానమంత్రులను ప్రధాని మోదీ కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. అన్ని పట్టణాలు, గ్రామాలు, నగరాలు తమ వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రతి పథకం కూడా మారుమూల గ్రామాల వరకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమృత్ సరోవర్ మిషన్ పురోగతి, హర్ ఘర్ తిరంగా ప్రచారానికి సంబంధించిన సన్నాహాలను కూడా సమీక్షించారు. సుపరిపాలన ద్వారా ఆజాదీ కా అమృత్‌కాల్‌ను అంత్యోదయ యుగంగా మార్చేందుకు సీఎంలందరూ కట్టుబడి ఉండాలన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..