భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాల మధ్య వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈరోజు కూడా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం పేర్ల నమోదులో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. చిలికి చిలికి గాలి వాన మాదిరిగా ఒకరిపై ఒకరు దాడులు చేస్తుకున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పనులన్నింటినీ సిద్దిపేటకే తీసుకెళ్తావని తనని తిడతారని.. కానీ వేరే విషయంలో తనను ఏమీ అనరని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రజలు తన కుటుంబసభ్యులతో సమానమని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలో కొండ భూదేవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రధాని మోడీ తల్లి పాల మీద తప్ప అన్నింటిపై పన్నులు వేశారని.. మోడీ పనుల ప్రధాని కాదు పన్నుల ప్రధాని అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
శంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంకీపాక్స్‌పై ఆదివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన మరునాడే ఈ సమావేశం జరగడం గమనార్హం.
భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. అతని భార్య పంఖూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు తన ట్విటర్‌లో ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక తమ కొడుకు పేరును కవిర్ కృనాల్ పాండ్యా' అని పెట్టినట్లు తెలిపాడు
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల తర్వాత కూడా, చైనా యుద్ధ విమానాలు తూర్పు లద్ధాఖ్‌లో మోహరించి భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో వాస్తవాధీన రేఖకు దగ్గరగా డ్రాగన్‌కు చెందిన విమానాలు ఎగురుతూనే ఉన్నాయి.
దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, రిటైర్డు ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రజలు, దేశవ్యాప్తంగా ఆదివాసీల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇటీవల మెట్రో రైలులో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మెట్రో రైలు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో చేసిన యువతిపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ప్రజలకు హైదరాబాద్ మెట్రో సంస్థ స్ట్రాంగ్ నోటీసు ఇచ్చింది.