Millet Breakfast: ఈ చిరుధాన్యాల బ్రేక్‌ఫాస్ట్‌తో రోజంతా ఫుల్ ఎనర్జీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millet Breakfast: ఆధునిక సాంకేతిక యుగంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం సవాలుగా మారింది. ముఖ్యంగా ఉదయం తీసుకునే అల్పాహారం మన రోజంతా ఉండే శక్తిని నిర్ధారిస్తుంది. ఈ సందర్భంగా పలువురు పోషకాహార నిపుణులు మాట్లాడుతూ.. మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను మళ్లీ మన పళ్లెంలోకి తెచ్చుకుంటే, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. బియ్యం, మైదాతో చేసిన ఇడ్లీ, దోశలకు భిన్నంగా.. జొన్నలు, రాగి, సజ్జలు వంటి తృణధాన్యాలతో చేసే అల్పాహారం అమృతంతో సమానం అని పేర్కొన్నారు. వీటిలో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వెల్లడించారు. ఈ స్టోరీలో జొన్నలు, రాగి, సజ్జలు వంటి తృణధాన్యాలతో సింఫుల్‌గా తయారు చేసుకునే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గురించి తెలుసుకుందాం.
READ ALSO: Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!
Also Read
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
- Crazy Kalyanam: క్రేజీ కళ్యాణం రివ్యూ..
- Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
- డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా రెడీ చేసుకోండి..
జొన్న రొట్టెలు: జొన్నల పిండిని మరగబెట్టిన నీటితో కలిపి మెత్తగా చేయడం వల్ల జొన్న రొట్టెలు మృదువుగా వస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు కండరాల పుష్టికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు సూచించారు.
రాగి జావ/అంబలి: నిజానికి రాగి జావ అనేది కాల్షియం నిధిగా చెబుతారు. రాగులతో జావ చేసుకుని తాగితే ఎముకలు బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, మహిళలకు రాగి జావను వారి రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలని వెల్లడించారు.
ముడి ధాన్యాల కిచిడీ: కూరగాయ ముక్కలు కలిపి వండుకునే సిరిధాన్యాల కిచిడీ విటమిన్ల గని గా పేర్కొన్నారు.
ఈ బ్రేక్ ఫాస్ట్‌లతో ఉపయోగాలు ఇవే..
బరువు నియంత్రణ: ఈ ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండుగా అనిపించి, అనవసరమైన చిరుతిళ్లపై మనసు పోదు.
గుండెకు మేలు: పీచు పదార్థం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
తక్షణ శక్తి: గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల నీరసం రాకుండా రోజంతా హుషారుగా ఉండవచ్చు.
ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ.. ఉదయం పూట నూనెలో వేయించిన పదార్థాల కంటే, ఆవిరిపై ఉడికించిన లేదా సహజ సిద్ధమైన తృణధాన్యాలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. మనం తీసుకునే ఆహారం మనకు ఔషధం కావాలని అనారోగ్య సమస్యలకు దారి తీసేదిగా ఉండకూడదని చెబుతున్నారు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, దానిని రుచి కోసం కాకుండా, ఆరోగ్యం కోసం ఆలోచించి తీసుకోవాలి సూచించారు.
READ ALSO: Maha Shivaratri 2026: రేపే మహాశివరాత్రి.. ఈ తప్పులు చేస్తే పుణ్యం రాదు సరే కదా.. మహా పాపం!
తాజావార్తలు
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..