పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్‌నాథ్ పవిత్ర గుహ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది, వైరస్ వ్యాప్తిని ఆపడానికి వేగవంతమైన చర్య కోసం పలు దేశాలు డబ్ల్యూహెచ్‌వోను విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటితే బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టీకాలు వేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలు, టీకాల గురించి తెలుసుకుందాం.
తమిళనాడు బాలికల ఆత్మహత్యలు ఆవేదన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కడలూర్ జిల్లాలో మంగళవారం 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రెండు వారాల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాజీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. 84 ఏళ్ల అబ్దుల్లాను పలుమార్లు ప్రశ్నించింది.
యూపీలోని లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మంగళవారం నిరాకరించింది.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక ధరలపై సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా సాగేలా సహకరించాలంటూ కోరారు. కానీ ఆందోళనను విరమించకపోవడంతో... నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలరు అంతరాయం కలిగిస్తున్నారంటూ విపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
భోజనం చేస్తున్న సమయంలో మనం తింటున్న కంచంలో చిన్న రాయి కనిపించినా చిరాకు వస్తుంది. కానీ ఇటీవల బిర్యాణీల్లో బల్లి, బొద్దింకలు బయటపడుతున్న విషయం తెలిసిందే. భోజనం చేస్తున్న పాము తల బయటపడితే ఎలా ఉంటుంది. ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే టర్కీలోని విమాన సిబ్బందికి ఎదురైంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 21న సోనియాను దాదాపు 2 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు రేపు మరోసారి ప్రశ్నించనున్నారు.
మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ... తాను బ్రిటన్ ప్రధాని అయితే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. బ్రిటన్‌తో పాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరణమించిందని ఆయన పేర్కొన్నారు.