ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోందని మండిపడ్డారు. కొన్ని సమయాల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయించడం కష్టమని.. ఆ తీర్పులను మీడియా ఇస్తోందన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యువకుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను, ఉద్యోగావకాశాలను మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందన్నారు.
శివసేన పార్టీ తమదేనని నిరూపించుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శివసేన తమదేనని బలమైన వాదన వినిపించడానికి ఇరు వర్గాలు ఈసీకి పత్రాలు సమర్పించాయి. ఈ పోరులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎవరిదో తేల్చేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణి విస్తృత స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఒక్క డోస్ కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది.పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిషేధిత జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తీహార్ జైలులో శుక్రవారం(జులై 22) నుంచి నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన కేసును సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు.
దాదాపుగా 5నెలలుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. తూర్పు యూరోపియన్ దేశానికి తన సైనిక సాయాన్ని పెంచడానికి అమెరికా ఆలోచిస్తోందని వైట్‌హౌస్ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. పెంటగాన్ ఇప్పుడు ఉక్రేనియన్ దళాలకు ఫైటర్ జెట్‌లను అందించడాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో 30 ఏళ్ల మహిళపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు 21,880 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు తాజాగా 67 మంది కరోనా బారినపడి చనిపోయారు.