Mahashivratri 2026: గుర్తుంచుకోండి.. శివాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. ఈ 5 పనులు అస్సలు చేయవద్దు..!
- రేపే మహాశివరాత్రి
- శైవ క్షేత్రాలు మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి
- పూజ తర్వాత కూడా, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపే మహాశివరాత్రి. శివభక్తులు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనదిగా, పవిత్రంగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. శివ పూజలకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయాలు మార్మోగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున చాలా మంది భక్తుు నిర్జల ఉపవాసం పాటిస్తారు, రాత్రంతా మేల్కొని ఉంటారు.
Also Read:Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
భక్తి శ్రద్ధలతో శివలింగానికి నీరు, పాలు, బిల్వ పత్రాన్ని సమర్పిస్తారు. కానీ పూజ తర్వాత కూడా, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు లేదా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని తప్పులు జరిగితే, పూజ ప్రయోజనాలు తగ్గుతాయని పండితులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 15, 2026న జరుపుకుంటారు. ఈ రోజున, భక్తులు తెల్లవారుజాము నుండే దేవాలయాల వద్ద బారులు తీరి, శివలింగంపై జలం పోసి, రాత్రంతా ఓం నమః శివాయ జపిస్తూ మేల్కొని ఉంటారు.
ఆలయం నుండి ఖాళీ చేతులతో తిరిగి రావద్దు
శివాలయాన్ని సందర్శించేటప్పుడు, భక్తులు నీరు, పాలు, పండ్లు, పువ్వులు లేదా నైవేద్యాలను తీసుకువెళ్తుంటారు. అయితే, శివాలయం నుంచి ఎప్పుడూ ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రాకూడదని గుర్తుంచుకోండి. మీరు నీటిని తెచ్చిన అదే పాత్ర లేదా కుండతో, ఆలయ ప్రసాదాలు, చరణామృతం, పువ్వులు లేదా కొద్ది మొత్తంలో పవిత్ర జలంతో మీ ఇంటికి చేరుకోవాలి. అలా చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఇంటికి సానుకూల శక్తిని తెస్తుందని, శివుని ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తుంటారు.
వెంటనే మీ చేతులు, కాళ్ళు కడుక్కోకండి
చాలా మంది ఆలయం నుండి తిరిగి వచ్చిన వెంటనే చేతులు, కాళ్ళు కడుక్కుంటారు. అయితే, మత విశ్వాసం ప్రకారం, ఆలయం నుండి తిరిగి వచ్చిన వెంటనే లేదా దారిలో ఎక్కడైనా చేతులు, కాళ్ళు కడుక్కోకూడదు. అలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, మొదట దేవునికి ప్రార్థనలు చేసి, నైవేద్యాలను సమర్పించి, కొంత సమయం తర్వాత మాత్రమే మీ చేతులు, కాళ్ళు కడుక్కోండి.
ప్రసాదం దారిలో తినకూడదు
ఆలయం నుండి తెచ్చిన ప్రసాదం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే దానిని తినకూడదు, దారిలో కూడా తినకూడదు. మొదట, ప్రసాదాన్ని శుభ్రమైన, పవిత్రమైన ప్రదేశంలో ఉంచండి, తరువాత మీ కుటుంబంతో కలిసి భక్తితో తినండి. ప్రసాదాన్ని ఎప్పుడూ అపవిత్రమైన ప్రదేశంలో ఉంచవద్దు లేదా దానిని అగౌరవంగా చూడకండి. ప్రసాదం ప్రత్యేక ప్రాముఖ్యతను గ్రంథాలు వివరించాయి.
గొడవలకు దూరంగా ఉండాలి
ఆలయం నుండి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్న తర్వాత, మీ మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి. ఎవరితోనైనా వాదనలు లేదా తగాదాలను పెట్టుకోవద్దు. ప్రతికూల సంభాషణలను కూడా నివారించాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున ఇంట్లో శాంతి, ప్రేమ వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Also Read:Ireland vs Oman: ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్
ఆలయం నుండి తిరిగి వచ్చిన వెంటనే నిద్రపోకండి
కొంతమంది అలసట కారణంగా ఉపవాసం ఉండి పూజలు చేసిన వెంటనే నిద్రపోతారు. అయితే, ఆలయం నుండి తిరిగి వచ్చిన వెంటనే నిద్రపోవడం శుభప్రదం కాదని నమ్ముతారు. ముందుగా, దేవుడిని స్మరించుకోండి, ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కొంత సమయం ప్రార్థన లేదా ధ్యానంలో గడపండి. ఇది పూజ ప్రయోజనాలను పెంచుతుంది. ఇంట్లో శాంతి, ఆనందాన్ని నింపుతుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?