Bodhan Mla Shakeel: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిపై రాజాసింగ్‌కు ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శల వర్షం గుప్పించారు. గోషామహల్ గుడుంబా కింగ్ రాజాసింగ్ అంటూ ఆరోపించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని.. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని షకీల్ సవాల్ విసిరారు. ప్రపంచంలో వ్యవసాయాధారిత పరిశ్రమలపై జీఎస్టీ విధించిన ఘనత బీజేపీదేనని ఆయన విమర్శించారు. రూ. 2500 కోట్ల నిధులు ఖర్చు చేసి బోధన్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. దళితబంధు పథకంపై కుట్రలు చేస్తూ బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. దళితబంధులో కమీషన్లు తీసుకుంటున్నారని అనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. దళితబంధులో కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
Minister KTR: కేటీఆర్‌కు నెటిజన్లు సూచించిన సినిమాలేంటో తెలుసా?
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మతాల పేరుతో కుట్రలు చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. యువకులను మతాల పేరుతో రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్నారు. ఎంపీ అర్వింద్ బోధన్ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి కోసం 10 పైసలు ఖర్చు చేసినట్లు నిరూపిస్తే నా ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. బోధన్ నియోజకవర్గంలో ఏ గ్రామం ఎక్కడ ఉందో తెలియని వ్యక్తి ఎంపీ అర్వింద్ అంటూ ఎద్దేవా చేశారు.